నామినేషన్ల తిరస్కరణపై పిటిషన్
ABN , Publish Date - Nov 25 , 2026 | 05:22 AM
గుడివాడలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా వైసీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. బొమ్ములూరులో టీడీపీ, వైసీపీలు మంగళవారం రోడ్‌షో నిర్వహించాయి.
గుడివాడలో వైసీపీ కార్యకర్తల వీరంగం
బొమ్ములూరులో ఎదురుపడిన టీడీపీ, వైసీపీల రోడ్‌షో
టీడీపీ కార్యకర్తల నుంచి జెండాను లాక్కుని..కింద పడేసి తొక్కిన వైసీపీ మహిళా కార్యకర్తలు
వైసీపీ శిబిరానికి వెళ్లి ప్రశ్నించిన ఎమ్మెల్యే రాము
ఆ పార్టీ నేతల క్షమాపణతో సద్దుమణిగిన వివాదం
విజయవాడ/గుడివాడ, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): గుడివాడలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా వైసీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. బొమ్ములూరులో టీడీపీ, వైసీపీలు మంగళవారం రోడ్‌షో నిర్వహించాయి. ప్రధాన రోడ్డులో స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రచారం నిర్వహిస్తుండగా.. క్రాస్ రోడ్డు నుంచి వైసీపీ రోడ్‌షో అదే రోడ్డు మీదకు చేరుకుంది. దీన్ని గమనించిన ఎమ్మెల్యే సంయమనంగా ఉండాలని, పరస్పరం గౌరవించుకుందామని టీడీపీ శ్రేణులకు సూచించారు. ‘గొడవలు పడవద్దు.. మీరూ సహకరించాలి’ అంటూ వైసీపీ శ్రేణులను కోరారు. అయితే వైసీపీ ప్రచార వాహనంపై ఉన్న కొందరు ఆ పార్టీ మహిళా కార్యకర్తలు రెచ్చగొట్టేలా ప్రవర్తించారు.
టీడీపీ కార్యకర్తల జెండాలను లాక్కొని, వాటిని కింద పడేసి కాళ్లతో తొక్కారు. అయినప్పటికీ టీడీపీ శ్రేణులు సంయమనం కోల్పోకుండా ఉండాలని ఎమ్మెల్యే హితవు పలికారు. తర్వాత ఈ విషయంపై టీడీపీ కార్యకర్తలు ఆయన్ను ప్రశ్నించారు. తల్లిలా, దైవంలా భావించే జెండాను కాళ్ళతో తొక్కి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దిసేపటి తర్వాత ఎమ్మెల్యే ఎవరికీ చెప్పకుండా బైక్‌పై నేరుగా వైసీపీ నేత దుక్కిపాటి శశిభూషణ్ దగ్గరకు వెళ్లారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు
అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి
మీరు ర్యాలీగా వెళ్లేటప్పుడు రోడ్డు మీద వైసీపీ జెండా పడితే.. దానిని తొక్కకుండా మా కార్యకర్తలతో తీయించి మీ కార్యకర్తను పిలిచి తీసుకోమని చెప్పానని.. అయితే తమ దైవంగా భావించే జెండాను మీ పార్టీ మహిళలు కింద పడేసి తొక్కడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై శశిభూషణ్, పలువురు వైసీపీ నేతలు స్పందిస్తూ.. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నామని, సీరియ్‌సగా తీసుకోవద్దని, మా వాళ్లకు కూడా గట్టిగా చెబుతామని అన్నారు. వారి తరపున తాము క్షమాపణలు కోరుతున్నామన్నారు. దీంతో వివాదం సద్దుమణిగింది.
ఈ వార్తలనూ చదవండి:
ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు
అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి