Share News

శభాష్‌.. ఏపీ

ABN , Publish Date - Oct 09 , 2026 | 04:24 AM

రాష్ట్రంలో పన్ను వసూళ్లు, జీఎస్టీ అమలు కోసం ఏఐను వాడుకుంటున్న తీరును జీఎస్టీ మండలి ప్రశంసించింది. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖను ప్రత్యేకంగా అభినందించింది.

శభాష్‌.. ఏపీ

  • ఏఐ వాడకంపై జీఎస్టీ కౌన్సిల్‌ ప్రశంసలు

  • పన్ను వసూళ్ల విధానంలో పారదర్శకత

అమరావతి, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పన్ను వసూళ్లు, జీఎస్టీ అమలు కోసం ఏఐను వాడుకుంటున్న తీరును జీఎస్టీ మండలి ప్రశంసించింది. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖను ప్రత్యేకంగా అభినందించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన గురువారం న్యూఢిల్లీలో 57వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జరిగింది. ఇందులో ఏపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ఏఐ ఆధారిత సంస్కరణలపై ప్రశంసలు వచ్చాయి. పన్ను వసూళ్ల విధానంలో పారదర్శకత పెంచడం, వ్యక్తిగత పక్షపాతాలకు తావులేకుండా చేయడం, జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడంతో పాటు పన్ను ఎగవేతలను సమర్థవంతంగా అడ్డుకోవడంలో ఏఐ సాంకేతికత అద్భుతమైన ఫలితాలు ఇస్తోందని జీఎస్టీ మండలి ప్రశంసించింది.

ఇప్పటికే రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్, అసోం, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌ ఇంకా మరికొన్ని రాష్ట్రాలు ఏపీ వాడుతున్న సాంకేతికతను అధ్యయనం చేస్తున్నాయి. మిగిలిన రాష్ట్రాలు కూడా ఏపీ తరహా ఏఐ విధానాలు పరిశీలించాలని జీఎస్టీ మండలి సిఫారసు చేసింది. కాగా, ఏపీ అవలంబిస్తున్న ఏఐ ఆధారిత పరిశీలన ద్వారా పక్కా ఆధారాలతో 10,817 కేసులు నమోదయ్యాయి. పాత విధానంలో పన్ను వ్యత్యాసాలు కేవలం రూ.366 కోట్లు బయటపడగా, ఈ నూతన ఏఐ విధానం ద్వారా ఏకంగా రూ.743 కోట్ల పన్ను ఎగవేతలను గుర్తించారు. గతంలో ప్రతికేసుపై సగటున రూ.3.08 లక్షల పన్ను వసూలు కాగా, ఏఐ నిఘా పెరిగిన తర్వాత సగటు రికవరీ ఏకంగా రూ.27.63 లక్షలకు చేరింది.

ఈ వార్తలనూ చదవండి:

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. చర్చించిన కీలక అంశాలివే..

డిజిటల్ కరెన్సీని మోదీ ప్రోత్సహించారు

Updated Date - Oct 09 , 2026 | 04:24 AM