Share News

మనవడే కాలయముడు!

ABN , Publish Date - Nov 16 , 2026 | 05:02 AM

అమ్మమ్మ అంటేనే అర్ధాయుష్షు అని నానుడి! అంటే మనవలపై అంత ప్రేమాభిమానాలు పెంచుకుంటారట! అలాంటిది తన కుమార్తె పుట్టిన రోజుకు కానుకలేవీ తేలదనే కోపంతో మనవడే అమ్మమ్మపై స్టీలు పాత్రతో దాడి చేసి...

మనవడే కాలయముడు!

  • కూతురికి కానుక తేలేదని అమ్మమ్మపై దాడి.. వృద్ధురాలి మృతి

తాడేపల్లిగూడెం టౌన్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): అమ్మమ్మ అంటేనే అర్ధాయుష్షు అని నానుడి! అంటే మనవలపై అంత ప్రేమాభిమానాలు పెంచుకుంటారట! అలాంటిది తన కుమార్తె పుట్టిన రోజుకు కానుకలేవీ తేలదనే కోపంతో మనవడే అమ్మమ్మపై స్టీలు పాత్రతో దాడి చేసి ఆమె మరణానికి కారణమయా పశ్చిమ గోదావరి జిల్లా మెట్టఉప్పరగూడెంలో ఈ దారుణం జరిగింది.

తాడేపల్లిగూడెం రూరల్‌ పోలీసుల కథనం మేరకు.. తాడేపల్లిగూడెం మండలం అప్పారావుపేటకు చెందిన ఆరుగొల్లు రుత్తమ్మ(62) తన మనవడి కుమార్తె (ముని మనవరాలి) మొదటి పుట్టినరోజు వేడుకలకు శనివారం రాత్రి మెట్టఉప్పరగూడెం వచ్చింది. అయితే ఆమె మునిమనవరాలి కోసం డబ్బుగానీ, ఇతర కానుకలు గానీ తేలేదని ఆమె కుమార్తె అంబిక కొడుకు.. మనవడు అయిన సురేష్‌ ఆమెతో వాగ్వాదానికి దిగాడు. విచక్షణ మరచి స్టీలు పాత్రతో తలపై బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలో ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ వార్తలనూ చదవండి:

సొంత వైద్యం.. ప్రాణాలకే ముప్పు

ఏపీలో జోరుగా పంచాయతీ ఎన్నికల నామినేషన్లు..!

Updated Date - Nov 16 , 2026 | 05:02 AM