Share News

గిరిబాబు మృతికి గవర్నర్‌, చంద్రబాబు, పవన్‌ సంతాపం

ABN , Publish Date - Nov 15 , 2026 | 01:26 AM

ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత గిరిబాబు మృతికి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌ సంతాపం తెలిపారు.

గిరిబాబు మృతికి గవర్నర్‌, చంద్రబాబు, పవన్‌ సంతాపం

అమరావతి, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత గిరిబాబు మృతికి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌ సంతాపం తెలిపారు. బహుముఖ ప్రజ్ఞతో తెలుగు సినిమాకు గణనీయమైన సేవలు అందించారని పేర్కొన్న గవర్నర్‌, గిరిబాబు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. సామాన్య కుటుంబంలో జన్మించిన గిరిబాబు ఐదు దశాబ్దాలపాటు 600కుపైగా చిత్రాల్లో నటించి, విలన్‌గా, హాస్యనటుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ప్రేక్షకులను మెప్పించారని సీఎం చంద్రబాబు అన్నారు. గిరిబాబు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ప్రముఖ నటుడు గిరిబాబు కన్నుమూశారని తెలిసి డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ చింతించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. నిర్మాతగా, దర్శకుడిగా విజయవంతమైన చిత్రాలు రూపొందించారని అన్నారు. గిరిబాబు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

జాతీయ బాలల దినోత్సవం.. చిన్నారులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు

కార్పొరేషన్‌పై కూటమి జెండా ఎగరేద్దాం

Updated Date - Nov 15 , 2026 | 01:32 AM