Share News

‘టిడ్కో’ రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్ల ఏర్పాటు

ABN , Publish Date - Oct 24 , 2026 | 05:55 AM

రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం నిర్మించిన టిడ్కో గృహ సముదాయాల్లో (ఎన్టీఆర్‌ నగర్‌ కాలనీలు) రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్ల ఏర్పాటు, వాటి నిర్వహణకు సంబంధించిన బైలాస్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో టిడ్కో లబ్ధిదారులు తమ కాలనీల్లోని సమస్యలను తామే పరిష్కరించుకోవడానికి మార్గం సుగమమైంది.

‘టిడ్కో’ రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్ల ఏర్పాటు

  • నిర్వహణ బైలాస్‌ను ఆమోదిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

అమరావతి, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం నిర్మించిన టిడ్కో గృహ సముదాయాల్లో (ఎన్టీఆర్‌ నగర్‌ కాలనీలు) రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్ల ఏర్పాటు, వాటి నిర్వహణకు సంబంధించిన బైలాస్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో టిడ్కో లబ్ధిదారులు తమ కాలనీల్లోని సమస్యలను తామే పరిష్కరించుకోవడానికి మార్గం సుగమమైంది. ఈ మేరకు రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేసింది.

టిడ్కో కాలనీల్లో ఫ్లాట్‌ ఉన్న ప్రతి లబ్ధిదారుడూ ఈ సంఘంలో సభ్యుడిగా చేరడానికి అర్హులే. ఒక్కో కాలనీలో జనాభా వెయ్యి మంది లేదా అంతకంటే తక్కువ ఉంటే రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ మేనేజింగ్‌ కమిటీ సభ్యులను ప్రజాస్వామ్య పద్ధతిలో జనరల్‌ బాడీ నేరుగా ఎన్నుకుంటుంది. ఆ కాలనీలో జనాభా వెయ్యి మంది కంటే ఎక్కువగా ఉంటే ప్రతి బ్లాక్‌ నుంచి ఒక ప్రతినిధిని ఎన్నుకుంటారు. ఆ ప్రతినిధులంతా ఎలక్టోరల్‌ కాలేజీగా ఏర్పడి మేనేజింగ్‌ కమిటీని ఎన్నుకుంటారు. ఈ కమిటీలో స్థానిక వార్డు కార్పొరేటరు ఎక్స్‌-అఫిషియో సభ్యుడిగా ఉంటారు.

ఈ వార్తలనూ చదవండి:

పల్లె పండుగకు నిధుల గండం

ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Updated Date - Oct 24 , 2026 | 05:55 AM