స్వర్ణ వార్డు ఉద్యోగులకు ప్రత్యేక గ్రేడ్
ABN , Publish Date - Sep 21 , 2026 | 05:48 AM
స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు(ఎస్‌జీఎస్‌డబ్ల్యూ) ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో 15,004 స్వర్ణగ్రామ, స్వర్ణవార్డులు ఉండగా, 2019, 2020 నోటిఫికేషన్ల ద్వారా నియమితులై, ఒకే పోస్టు/కేడర్‌లో ఆరు సంవత్సరాల సర్వీసు పూర్తిచేసిన ఉద్యోగులకు ఆటోమెటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీం కింద ప్రత్యేక గ్రేడ్ పోస్టు స్కేల్ మంజూరు చేసేందుకు అనుమతి ఇచ్చింది.
అమరావతి, విజయవాడ(గాంధీనగర్), సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు(ఎస్‌జీఎస్‌డబ్ల్యూ) ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో 15,004 స్వర్ణగ్రామ, స్వర్ణవార్డులు ఉండగా, 2019, 2020 నోటిఫికేషన్ల ద్వారా నియమితులై, ఒకే పోస్టు/కేడర్‌లో ఆరు సంవత్సరాల సర్వీసు పూర్తిచేసిన ఉద్యోగులకు ఆటోమెటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీం కింద ప్రత్యేక గ్రేడ్ పోస్టు స్కేల్ మంజూరు చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సంబంధిత లైన్ డిపార్ట్‌మెంట్లు, శాఖాధిపతులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ.. జీఓ 7ను విడుదల చేసింది. స్వర్ణగ్రామం, స్వర్ణవార్డు ఉద్యోగుల డిమాండ్లలో ముఖ్యమైన ఆటోమెటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ (ఏఏఎస్) అమలుకు ప్రభుత్వం జీవో 7 విడుదల చేయడంపై ఏపీ ఎన్జీజీవో హర్షం వ్యక్తం చేసింది.
ఈ మేరకు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.విద్యాసాగర్, రమణ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం జీవో 7 జారీ చేయడంపై స్వర్ణ గ్రామ, వార్డు ఉద్యోగుల సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు సంస్థ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేల్పుల అర్లయ్య, ఉప్పులూరి స్టాలిన్ చక్రవర్తి ప్రకటన విడుదల చేశారు.
ఈ వార్తలనూ చదవండి..