గండి పోశమ్మ ఆలయ గోపురాన్ని తాకిన వరద నీరు
ABN , Publish Date - Sep 26 , 2026 | 03:33 AM
భారీ వర్షాలకు శబరి, కిన్నెరసాని తదితర నదులు పొంగి ప్రవహించడంతో గోదావరికి వరదనీరు చేరుతుంది. దీంతో పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో....
భారీ వర్షాలకు శబరి, కిన్నెరసాని తదితర నదులు పొంగి ప్రవహించడంతో గోదావరికి వరదనీరు చేరుతుంది. దీంతో పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో గోదావరి ముంపు పరివాహక ప్రాంతాలు సుద్దకొండ, కచ్చులూరు, తాళ్లూరు, గొందూరు, మంటూరు, మడిపల్లి, మూలపాడు, అగ్రహారం, దేవీపట్నం, తొయ్యేరు, పూడిపల్లి తదితర గ్రామాలను ఆనుకుని గోదావరి ఉరకలేస్తూ ఉగ్రరూపం దాల్చింది. పవిత్ర పుణ్యక్షేత్రం గొందూరు గ్రామంలో గండిపోశమ్మ అమ్మవారి ఆలయ పైభాగాన గోపురానికి వరద నీరు చేరింది.
ఈ వార్తలనూ చదవండి..
ఎన్నికల్లో మోదీని ఎదుర్కోలేకే.. అసత్య ప్రచారాలు: రామ్ మాధవ్
హథీరాంజీ మఠం భూ లీజుదారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ