Share News

గోదావరికి పెరిగిన వరద

ABN , Publish Date - Sep 27 , 2026 | 03:20 AM

గోదావరికి వరద పోటెత్తుతోంది. ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద ఉధృతి మాత్రం తగ్గలేదు. ఎగువ రాష్ట్రాల నుంచి, ఉపనదుల నుంచి వస్తున్న వరద జలాలతో గోదావరి నీటిమట్టం శనివారం నాటికి అనూహ్యంగా పెరిగింది.

గోదావరికి పెరిగిన వరద

  • సముద్రంలోకి 5 లక్షల క్యూసెక్కులు విడుదల

  • నేడు 6 లక్షల క్యూసెక్కులకు చేరనున్న ప్రవాహం?

రాజమహేంద్రవరం, పోలవరం, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): గోదావరికి వరద పోటెత్తుతోంది. ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద ఉధృతి మాత్రం తగ్గలేదు. ఎగువ రాష్ట్రాల నుంచి, ఉపనదుల నుంచి వస్తున్న వరద జలాలతో గోదావరి నీటిమట్టం శనివారం నాటికి అనూహ్యంగా పెరిగింది. దీంతో పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నుంచి 5,38,238 క్యూసెక్కుల వరద జలాలను దిగువకు విడుదల చేసినట్టు డీఈ వెంకటేశ్వరరావు తెలిపారు. ఎగువ కాఫర్‌ డ్యామ్‌కు ఎగువన 30.850 మీటర్లు, స్పిల్‌వే ఎగువన 30.950 మీటర్లు నీటిమట్టం నమోదైంది. ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్లను 1.5 మీటర్ల మేర పైకి ఎత్తి సముద్రంలోకి 5.18 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఉపనది శబరి పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాలతో ఇప్పటికే వరద పోటెత్తింది. మరో ఉపనది ఇంద్రావతి పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల వస్తున్న వరద ప్రవాహం ఆదివారం ఉదయానికి ధవళేశ్వరం వద్దకు చేరుకోనుంది. తెలంగాణలోని భద్రాచలం వద్ద నీటిమట్టం శుక్రవారం 23 అడుగులు ఉండగా.. ఇంద్రావతి ప్రవాహం వల్ల శనివారం అది 29 అడుగులకు చేరింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద ఉధృతి 6 లక్షల క్యూసెక్కుల వరకు చేరుకొనే అవకాశం ఉంది.

ఈ వార్తలనూ చదవండి:

మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల ఉచిత బియ్యం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు

పర్యాటకం జోరు

Updated Date - Sep 27 , 2026 | 03:20 AM