Share News

జగన్‌ను ఓడించి ప్రజలే విశాఖను కాపాడారు: గంటా

ABN , Publish Date - Oct 26 , 2026 | 06:12 AM

ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి విశాఖకు ఏం చేశారో చెప్పుకోలేని స్థితిలో గొడ్డలి పార్టీ నాయకులు ఉన్నారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే నేడు సేవ్‌ వైజాగ్‌ పేరుతో కొత్త డ్రామా మొదలుపెట్టారని ఆదివారం ఓ ప్రకటనలో ఆరోపించారు.

జగన్‌ను ఓడించి ప్రజలే విశాఖను కాపాడారు: గంటా

అమరావతి, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి విశాఖకు ఏం చేశారో చెప్పుకోలేని స్థితిలో గొడ్డలి పార్టీ నాయకులు ఉన్నారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే నేడు సేవ్‌ వైజాగ్‌ పేరుతో కొత్త డ్రామా మొదలుపెట్టారని ఆదివారం ఓ ప్రకటనలో ఆరోపించారు. 2024 ఎన్నికల్లో జగన్‌ని, వైసీపీని ఓడించి విశాఖను ప్రజలే కాపాడుకున్నారన్నారు. జగన్‌ ఐదేళ్ల పాలనలో విశాఖ నగరాన్ని, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధికి దూరం చేశారని ఆరోపించారు.

2014లో తన తల్లిని ఓడించారనే కక్షతోనే ఈ ప్రాంతంపై జగన్‌ వివక్ష చూపించారన్నారు. జగన్‌ హయాంలో విశాఖ వచ్చిన కంపెనీలు పక్క రాష్ర్టాలకు పారిపోయాయని తెలిపారు. ఉత్తరాంధ్రకు కొత్త భవిష్యత్తును అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత ఎన్నికల్లో మాదిరిగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో గొడ్డలి పార్టీకి ఓటమి ఖాయమని తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

ఓటరు తీరుమారేనా?

అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం

Updated Date - Oct 26 , 2026 | 06:12 AM