మే 31 వరకూ సీఎస్‌గా సాయిప్రసాద్
ABN , Publish Date - Oct 23 , 2026 | 04:44 AM
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌కు రెండోసారి సర్వీపు పొడిగింపు లభించింది. మే 31 వరకు ఆయనే సీఎస్‌గా కొనసాగనున్నారు.
మరో 6 నెలలు సర్వీసు పొడిగింపునకు ఓకే
అమరావతి, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌కు రెండోసారి సర్వీపు పొడిగింపు లభించింది. మే 31 వరకు ఆయనే సీఎస్‌గా కొనసాగనున్నారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీఓపీటీ) గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. సాయిప్రసాద్ పదవీకాలం తొలి పొడిగింపు ఈ ఏడాది నవంబరు నెలాఖరుతో ముగియనుంది.
అయితే, ఆయన సర్వీసును మరో ఆరు నెలలు అంటే... ఈ ఏడాది డిసెంబరు ఒకటి నుంచి వచ్చే ఏడాది మే 31 వరకు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం డీఓపీటీని కోరుతూ గతనెల 29న లేఖ రాసింది. ప్రతిపాదనను పరిశీలించిన కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంది. సాయిప్రసాద్ సర్వీసును వచ్చే ఏడాది మే 31 వరకు పొడిగిస్తూ డీఓపీటీ అండర్ సెక్రెటరీ రాజేశ్ కుమార్ యాదవ్ గురువారం ఆదేశాలు జారీ చేశారు.
ఈ వార్తలనూ చదవండి: