Share News

జగన్‌ను ప్రజలు ఎప్పుడో మడతపెట్టేశారు

ABN , Publish Date - Oct 31 , 2026 | 04:28 AM

చొక్కా మడతపెడతానంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్‌ సినిమా డైలాగులు చెబుతున్నారని, ఆయన్ను ప్రజలు ఎప్పుడో మడతపెట్టేశారని, ఆ విషయం ఆయన తెలుసుకోవాలని మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు.

జగన్‌ను ప్రజలు ఎప్పుడో మడతపెట్టేశారు

  • ఆ విషయం ఆయన తెలుసుకోవాలి

  • వైసీపీ మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ ఫైర్‌

  • టీడీపీలో చేరిన అప్పలనాయుడు

విశాఖపట్నం, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): చొక్కా మడతపెడతానంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్‌ సినిమా డైలాగులు చెబుతున్నారని, ఆయన్ను ప్రజలు ఎప్పుడో మడతపెట్టేశారని, ఆ విషయం ఆయన తెలుసుకోవాలని మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. జగన్‌.. ఒంటెత్తుపోకడలతో వ్యవహరిస్తుంటారని, అందుకు తగినట్టుగానే వైసీపీ కార్పొరేట్‌ కంపెనీ మాదిరిగా తయారైందని విమర్శించారు. అక్కడ జగన్‌కు తప్ప మరెవరికీ విలువ ఉండదని ధ్వజమెత్తారు. శుక్రవారం నెల్లిమర్లకు చెందిన సుమారు 50 మంది ముఖ్యనాయకులతో కలిసి బడ్డుకొండ టీడీపీలో చేరారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, హోం మంత్రి వంగలపూడి అనిత కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం అప్పలనాయుడు మాట్లాడుతూ.. మనుషుల మధ్య విభేదాలున్నా, కుటుంబంలో జరిగే శుభకార్యాలకు హాజరవుతుంటామని, అటువంటిది జగన్‌ తన సొంత మేనకోడలు పెళ్లికి వెళ్లకుండా రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు.

సొంత సోదరికి ఆస్తిలో వాటా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ఆయన వైఖరి కారణంగానే 2024లో వైసీపీ 11 సీట్లకు పరిమితం అయిందని ఆరోపించారు. టీడీపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, తనపై ఉంచిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తానన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

శబరిమలై రైళ్లు ఫుల్‌

ఎల్ నినో వెళ్లిపోయాక.. వర్షాలే వర్షాలు?

Updated Date - Oct 31 , 2026 | 04:28 AM