Share News

జగన్‌కు మానసిక సమతుల్యత లోపం: అశోక్‌బాబు

ABN , Publish Date - Oct 30 , 2026 | 05:11 AM

రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిందని, ఇక అసలైన ఎన్నికల సమరం మొదలైందని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ సీనియర్‌ నేత పర్చూరి అశోక్‌బాబు అన్నారు.

జగన్‌కు మానసిక సమతుల్యత లోపం: అశోక్‌బాబు

అమరావతి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిందని, ఇక అసలైన ఎన్నికల సమరం మొదలైందని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ సీనియర్‌ నేత పర్చూరి అశోక్‌బాబు అన్నారు. గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైసీపీని ఎందుకు ఓడించాలన్న ప్రధాన అజెండాతో తాము ప్రజల్లోకి వెళుతున్నామని చెప్పారు.

ఎన్నికల్లో ప్రజలు తనను ఎలాగూ గెలవనివ్వరని తెలియడంతో ఎన్నికలను అడ్డుకునేందుకు గొడ్డలి పార్టీ నేత అన్ని దారులూ వెతుక్కుని విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. అబద్ధాలు, కుట్రలతో కాలం వెళ్లదీస్తున్న జగన్‌ రెడ్డి మానసిక సమతుల్యత కోల్పోయారన్నారు. సొంత తల్లి, చెల్లిని గౌరవించలేని జగన్‌ మహిళా సంక్షేమం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

ఈ వార్తలనూ చదవండి:

తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు

ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు

Updated Date - Oct 30 , 2026 | 05:11 AM