టీడీపీ సైకిలెక్కిన బొత్స బంధువులు
ABN , Publish Date - Nov 14 , 2026 | 04:39 AM
స్థానిక ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి కోలుకోకముందే.. వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి, వైసీపీ ముఖ్య నేత బొత్స సత్యనారాయణ సమీప బంధువు
వైసీపీకి గుడ్‌బై చెప్పిన తణుకు నేతలు
తణుకు, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి కోలుకోకముందే.. వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి, వైసీపీ ముఖ్య నేత బొత్స సత్యనారాయణ సమీప బంధువు, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మున్సిపల్ మాజీ చైర్మన్ బలగం సీతారామ్ కుమారులు బాబీ, రాజ్‌కుమార్ టీడీపీ తీర్దం పుచ్చుకున్నారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
బొత్స సత్యనారాయణ సోదరుడు సతీశ్‌కు బలగం సీతారామ్ పిల్లనిచ్చిన మామ. తూర్పుకాపు సామాజికవర్గంలో బలగం కుటుంబానికి మంచి పేరుంది. బలగం బాబీ గతంలో వైసీపీ యూత్ పట్టణ అధ్యక్షుడిగా పనిచేశారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు బలగం కుటుంబం టీడీపీలో చేరడంతో పట్టణంలో రాజకీయ సమీకరణలు మారనున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్