Share News

అధికార లాంఛనాలతో డాక్టర్‌ బాబ్జీ అంత్యక్రియలు

ABN , Publish Date - Nov 06 , 2026 | 06:24 AM

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ వైద్యులు డాక్టర్‌ త్సవటపల్లి సత్యనారాయణమూర్తి(బాబ్జీ) అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో గురువారం జరిగాయి.

అధికార లాంఛనాలతో డాక్టర్‌ బాబ్జీ అంత్యక్రియలు

  • పాడె మోసిన మంత్రి నిమ్మల రామానాయుడు

పాలకొల్లు అర్బన్‌, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ వైద్యులు డాక్టర్‌ త్సవటపల్లి సత్యనారాయణమూర్తి(బాబ్జీ) అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో గురువారం జరిగాయి. మంత్రి నిమ్మల రామానాయుడు బాబ్జీ పార్ధివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం అంతిమ యాత్రలో పాల్గొని పాడె మోశారు. డాక్టర్‌ బాబ్జీ మృతదేహానికి మనుమడు నిహార్‌ దహన సంస్కారాలు నిర్వహించారు. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యేలు కొత్తపల్లి జానకిరామ్‌, బండారు మాధవనాయుడు తదితరులు బాబ్జీ మృతదేహం వద్ద నివాళులర్పించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఓటెత్తిన పల్లెలు

అభివృద్ధి చేయలేదని.. ఎన్నికల బహిష్కరణ

Updated Date - Nov 06 , 2026 | 06:27 AM