ఉద్యోగులకు అండగా కూటమి ప్రభుత్వం: అశోక్‌బాబు
ABN , Publish Date - Nov 01 , 2026 | 04:59 AM
గత కొద్ది రోజులుగా సర్వీసు నుంచి డిస్మిస్ అయిన ఓ మాజీ ఉద్యోగ సంఘం నాయకుడు, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు ఏదో మేలు జరిగిపోయినట్లు ప్రచారం చేస్తూ...
గత కొద్ది రోజులుగా సర్వీసు నుంచి డిస్మిస్ అయిన ఓ మాజీ ఉద్యోగ సంఘం నాయకుడు, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు ఏదో మేలు జరిగిపోయినట్లు ప్రచారం చేస్తూ... రాబోయే స్థానిక ఎన్నికల్లో ఉద్యోగులంతా వైసీపీకి మద్దతు ఇవ్వాలని ప్రకటనలు చేయడం హాస్యాస్పదమని మాజీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్‌బాబు అన్నారు. ఉద్యోగ సంఘం నాయకుడిగా ఉంటూ ఉద్యోగుల సమస్యలపై పోరాడాల్సిందిపోయి వైసీపీ పంచన చేరి పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిలా వ్యవహరించినందుకే ప్రభుత్వం ఆయన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసిందని అన్నారు. ‘ఉద్యోగుల సంక్షేమానికి టీడీపీ హయామే స్వర్ణయుగం. జగన్ పాలనలో కోతలు, మోసాలే తప్ప ఉద్యోగులకు ఒరిగిందేమీ లేదు. ఏ కష్టమొచ్చినా ఉద్యోగులకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తోంది’ అని అశోక్ అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీకి మరో పెను తుఫాన్ ముప్పు.. ఆ జిల్లాలకు అలర్ట్..
జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక మలుపు..!