ఏపీ మద్యం రవాణా స్కామ్ .. మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్..
ABN , Publish Date - Aug 23 , 2026 | 05:41 PM
ఆంధ్రప్రదేశ్ మద్యం రవాణా స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును అరెస్ట్ చేశారు.
ఇంటర్‌నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ మద్యం రవాణా స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను ఇప్పటికే ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో కారుమూరి సునీల్ కూడా ఉన్నారు.
నిందితులందరూ వైసీపీ హయాంలో ఏపీ లిక్కర్ రవాణాలో అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. కాంట్రాక్టుల ద్వారా రూ.28 కోట్ల వరకు ముడుపులు తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. కుంభకోణం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.195.33 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు తేల్చారు. సిగ్మా, సుదర్శన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలకు మద్యం రవాణాలో అక్రమాలు జరిగినట్లు.. సుదర్శన్ కన్‌స్ట్రక్షన్‌కు కాంట్రాక్టులు ఇప్పించేందుకు రూ.28 కోట్ల ముడుపులు తీసుకున్నట్లు అధికారులు ఆధారాలు సేకరించారు. రవాణా ద్వారా వచ్చిన ఆదాయంలో 96 శాతం సిండికేట్ ఖాతాలకు వెళ్లగా.. సిగ్మా సంస్థకు 4 శాతం ముడుపులు మళ్లించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.
ఇవి కూడా చదవండి
వెలిగొండ నిర్మాణంతో.. నిర్వాసితుల జీవితాల్లో వెలుగు: లంక దినకర్
ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే మా దేశం ముక్కలవుతుంది: ఉక్రెయిన్ అధ్యక్షుడు