Share News

ఉమ్మడి ఏపీ శాసన మండలి మాజీ చైర్మన్‌ చక్రపాణి కన్నుమూత

ABN , Publish Date - Nov 05 , 2026 | 05:24 AM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి మాజీ చైర్మన్‌ చక్రపాణి (92) బుధవారం హైదరాబాద్‌లోని స్వగృహంలో కన్నుమూశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం హుసేనాపురం గ్రామంలో అప్పనబోయిన చక్రపాణి యాదవ్‌ జన్మించారు.

ఉమ్మడి ఏపీ శాసన మండలి మాజీ చైర్మన్‌ చక్రపాణి కన్నుమూత

  • వరుసగా పదేళ్లపాటు ఆ పదవిలో.. కర్నూలులో న్యాయవాదిగా వృత్తి జీవితం

కర్నూలు కల్చరల్‌, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి మాజీ చైర్మన్‌ చక్రపాణి (92) బుధవారం హైదరాబాద్‌లోని స్వగృహంలో కన్నుమూశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం హుసేనాపురం గ్రామంలో అప్పనబోయిన చక్రపాణి యాదవ్‌ జన్మించారు. కర్నూలు ఉస్మానియా కళాశాల్లో డిగ్రీ విద్య అభ్యసించిన ఆయన దాదాపు మూడు దశాబ్దాలు హైకోర్టు న్యాయవాదిగా పనిచేశారు. 2007 నుంచి 2016 మార్చి వరకు శాసన మండలి చైర్మన్‌గా వ్యవహరించారు. సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకునిగా గుర్తింపు పొందిన చక్రపాణి, 1970 దశకం నుంచి కేంద్ర, రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులతో సన్నిహితంగా మెలిగారు. ఏఐసీసీ కర్ణాటక రాష్ట్ర ఇన్‌చార్జిగా, పీసీసీ కోఆర్డినేటర్‌గా, శాసన మండలి చీఫ్‌ విప్‌గా, మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు. పదేళ్ల పాటు వరుసగా మండలి చైర్మన్‌గా పనిచేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, సోనియాగాంధీలతో పనిచేసిన ఆయన, నిజాయితీ కలిగిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ.. సుప్రీంకోర్టులో పిటిషన్

ఫోర్జరీ, చీటింగ్‌ కేసులో సులోచన సహా ముగ్గురికి రిమాండ్‌

Updated Date - Nov 05 , 2026 | 05:26 AM