‘పోలవరం’ పురోగతి సంతృప్తికరం
ABN , Publish Date - Oct 16 , 2026 | 04:15 AM
పోలవరం ప్రాజెక్టు డిజైన్లు, పనులు ప్రణాళిక ప్రకారమే సాగుతున్నాయని విదేశీ నిపుణుల బృందం(పీవోఈ) సంతృప్తి వ్యక్తం చేసింది. రిచర్డ్ డొనెల్లీ, గ్లాన్ఫ్రాంకో డి సిక్కో, సీన్ హించ్ బెర్గర్, డేవిడ్ పాల్తో కూడిన బృందం..
ప్రణాళిక ప్రకారమే డిజైన్లు, పనులు
విదేశీ నిపుణుల బృందం కితాబు
అమరావతి/పోలవరం, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు డిజైన్లు, పనులు ప్రణాళిక ప్రకారమే సాగుతున్నాయని విదేశీ నిపుణుల బృందం(పీవోఈ) సంతృప్తి వ్యక్తం చేసింది. రిచర్డ్ డొనెల్లీ, గ్లాన్ఫ్రాంకో డి సిక్కో, సీన్ హించ్ బెర్గర్, డేవిడ్ పాల్తో కూడిన బృందం గురువారం రెండో రోజు ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించి, ఆరు గంటల పాటు సుదీర్ఘ సమావేశం నిర్వహించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన కాల వ్యవధిలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ.. పనులు వేగవంతంగా చేయాలని నిర్మాణ సంస్థకు సూచించారు. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు కొండలతో కలుపుతూ గౌటింగ్ చేసిన విధానాన్ని సమీక్షించారు.
సాంకేతికంగా కొండల అంచులకు ఈసీఆర్ఎఫ్ డ్యామ్తో కలిపిన విధానానంపైనా, పోలవరం పనుల నాణ్యతా ప్రమాణాలపైనా అధికారులు ఇచ్చిన వివరణతో నిపుణులు సంతృప్తి వ్యక్తం చేశారు. జి, డి కొండల మధ్య గ్రౌటింగ్ పనులు బాగున్నాయని ప్రశంసించారు. ప్రాజెక్టు నిర్మాణాలు ఆమోదించిన డిజైన్ల ప్రకారమే జరుగుతున్నాయని, బృందం సభ్యులకు అఫ్రీ సంస్థ ప్రతినిధులు వివరించారు. ఈ సందర్భంగా నిర్మాణ సంస్థకు, అధికారులకు పీపీఏ సీఈవో సంజీవ్ వోహ్రా పలు సూచనలు చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు