Share News

ఐదుగురు హైకోర్టు అదనపు న్యాయమూర్తులకు శాశ్వత జడ్జీల హోదా

ABN , Publish Date - Oct 03 , 2026 | 03:56 AM

ఏపీ హైకోర్టులో సేవలందిస్తున్న ఐదుగురు అదనపు న్యాయమూర్తులకు శాశ్వత న్యాయమూర్తుల హోదా కల్పిస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

 ఐదుగురు హైకోర్టు అదనపు న్యాయమూర్తులకు శాశ్వత జడ్జీల హోదా

  • కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్‌ జారీ

  • నేడు ప్రమాణం చేయించనున్న చీఫ్‌ జస్టిస్‌ లిసాగిల్‌

అమరావతి, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టులో సేవలందిస్తున్న ఐదుగురు అదనపు న్యాయమూర్తులకు శాశ్వత న్యాయమూర్తుల హోదా కల్పిస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. జస్టిస్‌ కుంచెం మహేశ్వరరావు, జస్టిస్‌ టీసీ ధనశేఖర్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌, జస్టిస్‌ అవధానం హరి హరనాథ శర్మ, జస్టిస్‌ డాక్టర్‌ యడవల్లి లక్ష్మణరావును శాశ్వత న్యాయమూర్తులుగా నియమించేందుకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆమోదముద్ర వేశారు. వీరిలో జస్టిస్‌ కుంచం మహేశ్వరరావు, జస్టిస్‌ టీసీ ధనశేఖర్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా 2024 అక్టోబరు 28న ప్రమాణం చేశారు. జస్టిస్‌ అవధానం హరి హరనాథ శర్మ, జస్టిస్‌ డాక్టర్‌ యడవల్లి లక్ష్మణరావు 2025 జనవరి 24న ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు. అదనపు న్యాయమూర్తులుగా జస్టిస్‌ కుంచం మహేశ్వరరావు, జస్టిస్‌ టీసీ ధనశేఖర్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌ పదవీకాలం అక్టోబరు 27తో, అలాగే న్యాయమూర్తులు జస్టిస్‌ అవధానం హరి హరనాథ శర్మ, జస్టిస్‌ డాక్టర్‌ యడవల్లి లక్ష్మణరావు పదవీకాలం 2027 జనవరి 23తో ముగియనుంది. ఈ నేపథ్యంలో వీరిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని కోరుతూ సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని కొలీజియం ఇటీవల కేంద్రానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. కాగా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లిసాగిల్‌ సోమవారం వీరితో శాశ్వత న్యాయమూర్తులుగా ప్రమాణం చేయించనున్నారు.

ఈ వార్తలనూ చదవండి..

స్వచ్ఛతే ఆరోగ్యానికి తొలిమెట్టు

శ్రీవారి ఆలయానికి ‘స్వచ్ఛ’ అవార్డు

Updated Date - Oct 03 , 2026 | 03:56 AM