Share News

రాష్ట్రానికి ‘ఎస్సార్‌ పవర్‌’

ABN , Publish Date - Nov 05 , 2026 | 05:46 AM

ఎస్సార్‌ పవర్‌ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. రూ.4,500 కోట్ల పెట్టుబడితో 300 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది.

 రాష్ట్రానికి ‘ఎస్సార్‌ పవర్‌’

  • 4,500 కోట్ల భారీ పెట్టుబడితో 300 మెగావాట్ల ప్రాజెక్టు

అమరావతి, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): ఎస్సార్‌ పవర్‌ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. రూ.4,500 కోట్ల పెట్టుబడితో 300 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. ఎస్సార్‌ పవర్‌ అనుబంధ సంస్థ అయిన ఎస్సార్‌ రెన్యూవబుల్స్‌ లిమిటెడ్‌ ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తుంది. ఈ సంస్థ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్‌హెచ్‌పీసీ(నేషనల్‌ హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌)తో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఈ గ్రిన్‌ఫీల్డ్‌ ప్రాజెక్టు అభివృద్ధి కోసం ఎస్సార్‌ పవర్‌ రాష్ట్రంలో సుమారు రూ.4,500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా నిరంతర విద్యుత్‌ సరఫరా కోసం సౌర, పవన విద్యుత్‌లతోపాటు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ వ్యవస్థ(బీఈఎస్‌ఎస్)లను హైబ్రిడ్‌ విధానంలో అనుసంధానం చేస్తారు. సాధారణ గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల మాదిరిగా కాకుండా, గ్రిడ్‌ అవసరాలకు అనుగుణంగా నిరంతరం, స్థిరమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది.

ఈ వార్తలనూ చదవండి:

ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ.. సుప్రీంకోర్టులో పిటిషన్

ఫోర్జరీ, చీటింగ్‌ కేసులో సులోచన సహా ముగ్గురికి రిమాండ్‌

Updated Date - Nov 05 , 2026 | 05:46 AM