Share News

ఏలూరు జిల్లాలో ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు

ABN , Publish Date - Sep 12 , 2026 | 09:13 AM

ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చింతలపూడి మండలం లింగగూడెం వద్ద గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది. వివరాల్లోకి వెళితే..

ఏలూరు జిల్లాలో ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
Eluru Road Accident

ఏలూరు, సెప్టెంబర్ 12: జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చింతలపూడి మండలం లింగగూడెం వద్ద గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. హైదరాబాద్‌ నుంచి విజయనగరం వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు.. స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ప్రయాణికులను చికిత్స నిమిత్తం చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


బస్సు వేగంగా వచ్చి ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఢీకొన్న సమయంలో బస్సులో ప్రయాణికులు ఉండటంతో కొందరికి తీవ్ర గాయాలు కాగా.. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి వివరాలు.. గాయపడిన వారి పూర్తి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. క్షతగాత్రులను చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో హైవేపై కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా.. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.


ఇవీ చదవండి:

ప్రపంచ ఆర్థిక వృద్ధి కంటే రెండింతల వేగంతో 'బ్రిక్స్‌' వృద్ధి: మోదీ

పుతిన్-మోదీ ప్రయాణించిన కారు చలించే ఓ ఉక్కుకోట!

Updated Date - Sep 12 , 2026 | 11:44 AM