Share News

మూడో పంటా.. పోయింది!

ABN , Publish Date - Nov 19 , 2026 | 06:15 AM

ఎల్‌నినో.. వరదలు.. తుఫాను దెబ్బకు రైతులు విలవిల్లాడుతున్నారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి వేసిన పంటలు.. చేతికి రాక తీవ్రంగా నష్టపోతున్నారు.

మూడో పంటా.. పోయింది!

  • ఎల్‌నినో.. వరదలు.. తుఫానుతో నష్టపోయిన రైతన్న

వేలేరుపాడు, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో.. వరదలు.. తుఫాను దెబ్బకు రైతులు విలవిల్లాడుతున్నారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి వేసిన పంటలు.. చేతికి రాక తీవ్రంగా నష్టపోతున్నారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో రైతులు సాగు చేసిన మిర్చి, అపరాలు, పొగాకు పంటలు ఎల్‌నినో కారణంగా వర్షాలు లేక దెబ్బతిన్నాయి. మళ్లీ కూడదీసుకుని రెండోసారి పంటలు సాగు చేశారు.

ఈసారి గోదావరి నదికి ఆకస్మికంగా వచ్చిన వరదలు పంటలను ముంచెత్తాయి. సుమారు ఐదు వేల ఎకరాల్లో వేసిన మిర్చి, అపరాలు, పొగాకు పంటలు దెబ్బతిన్నాయి. వరదలు తగ్గాక.. మూడోసారి మళ్లీ పంటలు వేశారు. ఈసారి మురసు తుఫాను ముంచేసింది. భారీ వర్షాలకు పంటలన్నీ నీట మునిగిపోగా, పెదవాగు ప్రాజెక్టుకు గండిపడటంతో భారీ వరదకు పంటలు కొట్టుకుపోయాయి. మూడు వందల ఎకరాల్లో కోత దశకు వచ్చిన మినుము పంట నీట మునిగిపోయింది. దీంతో రైతులు పంటను పశువుల మేతకు వదిలివేశారు. ఎకరానికి రూ.40 వేల వరకు ఖర్చు చేశామని రైతులు వాపోయారు.

ఈ వార్తలనూ చదవండి:

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్‌కు లోకేశ్ కౌంటర్

పంజాబ్‌లో లారీ డ్రైవర్‌కు రూ.12 కోట్ల జాక్‌పాట్

Updated Date - Nov 19 , 2026 | 06:15 AM