ఎలుకల దాడిలో 8 మంది విద్యార్థినులకు గాయాలుఎలుకల దాడిలో 8 మంది విద్యార్థినులకు గాయాలు
ABN , Publish Date - Nov 15 , 2026 | 04:23 AM
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో శుక్రవారం రాత్రి ఎలుకలు దాడి చేయగా ఎనిమిది మంది విద్యార్థినులు గాయపడ్డారు
రామకృష్ణాపురం గురుకుల పాఠశాలలో ఘటన
సత్తెనపల్లి, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో శుక్రవారం రాత్రి ఎలుకలు దాడి చేయగా ఎనిమిది మంది విద్యార్థినులు గాయపడ్డారు. గాయపడిన విద్యార్థినులను చికిత్స నిమిత్తం శనివారం వారిని సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తీసుకువచ్చారు. పాఠశాలలో ఎలుకలు ఎక్కువగా సంచరించడం వల్లే ఈ సంఘటన జరిగింది. గత నెలలో ఓ విద్యార్థిని ప్రమాదవశాత్తు చికెన్ గిన్నెలో పడి గాయపడింది. ఈ సంఘటన మరవక ముందే ఈ వ్యవహారం వెలుగు చూడటంతో పాఠశాలలో విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థినులు గాఢనిద్రలో ఉన్న సమయంలో ఎలుకలు గాయపరిచినట్టు తెలిసింది. ఎలుకల దాడి ఘటనపై గురుకుల పాఠశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆమె అందుబాటులో లేరు.
ఈ వార్తలనూ చదవండి:
జాతీయ బాలల దినోత్సవం.. చిన్నారులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు
కార్పొరేషన్‌పై కూటమి జెండా ఎగరేద్దాం