Share News

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు సతీమణికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ..

ABN , Publish Date - Mar 07 , 2026 | 08:04 PM

దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు సతీమణి లక్ష్మీదుర్గకు రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు సతీమణికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ..
Subrahmanyam case

తూర్పుగోదావరి, మార్చి 7: దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు సతీమణి లక్ష్మీదుర్గకు రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ కోర్ట్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో పోలీసులు లక్ష్మీదుర్గను అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై బాధిత కుటుంబానికి మద్దతుగా తాను చేసిన న్యాయపోరాటం ఫలించిందని న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు అంటున్నారు.


కాగా, సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి తదుపరి విచారణలో లక్ష్మీదుర్గను ఏ-2గా చేర్చి బుధవారం నాడు న్యాయస్థానంలో సిట్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా విచారణ జరిపిన రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.


ఇవి కూడా చదవండి

ఇరాన్ ఇంకెంతమాత్రం మధ్యప్రాచ్యాన్ని శాసించలేదు.. భారీ దాడులు తప్పవని ట్రంప్ హెచ్చరిక

కల్తీ నెయ్యి కేసు.. విజయభాస్కర్‌రెడ్డికి హైకోర్టులో దక్కని ఊరట

Updated Date - Mar 07 , 2026 | 08:36 PM