కల్తీ నెయ్యి కేసు.. విజయభాస్కర్‌రెడ్డికి హైకోర్టులో దక్కని ఊరట
ABN , Publish Date - Mar 07 , 2026 | 06:40 PM
కల్తీ నెయ్యి కేసులో నిందితుడిగా ఉన్న డెయిరీ నిపుణుడు విజయభాస్కర్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట దక్కలేదు. కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
ఇంటర్‌నెట్ డెస్క్: కల్తీ నెయ్యి కేసులో నిందితుడిగా ఉన్న టీటీడీలో డెయిరీ నిపుణుడు విజయభాస్కర్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట దక్కలేదు. కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ వ్యవహారంలో సమగ్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది మోహన్ రెడ్డి వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తు పూర్తయి ప్రాథమిక చార్జ్ షీట్ దాఖలు చేయడంతో బెయిల్ ఇవ్వాలని మోహన్ రెడ్డి వాదించారు. హవాలా మార్గంలో పిటిషనర్‌కు 75 లక్షల రూపాయలు అందాయని సీబీఐ తరఫు న్యాయవాది సురేష్ కుమార్ కోర్టుకు వివరించారు.
కాగా, సికింద్రాబాద్‌కు చెందిన విజయభాస్కర్‌రెడ్డిని టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో నిందితుడిగా(ఏ34) చేరుస్తూ గత నవంబరు 23న నెల్లూరు ఏసీబీ కోర్టులో సిట్ మెమో దాఖలు చేసింది. అర్హత లేని డెయిరీలకు సహకరించడం ద్వారా ఆయా సంస్థల నుంచి ఆయన భారీగా లబ్ధి పొందారని సిట్ తెలిపింది. ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే డెయిరీ ఎండీ జగ్‌మోహన్ గుప్తా నుంచి రూ.2.50లక్షలు లంచంగా తీసుకున్నారని వెల్లడించింది. ఆల్ఫా డెయిరీ ప్రతినిధుల నుంచి 8 గ్రాముల గోల్డ్ కాయిన్.. వైష్ణవి, భోలేబాబా, మాల్‌గంగా, ప్రీమియర్ ఫుడ్స్ తదితర డెయిరీల నుంచి హైదరాబాద్‌లోని హవాలా ఏజంట్ ద్వారా మొత్తం రూ.83 లక్షలు లంచంగా తీసుకున్నారని ఆరోపించింది.
ఇవి కూడా చదవండి
ఆసీస్‌తో ఏకైక టెస్ట్: రెండో రోజు ముగిసిన ఆట.. టీమిండియా స్కోర్ 105/6
విజయ్ ఇంట్లో ఉండేందుకు అనుమతి కోరుతూ ఆయన భార్య పిటిషన్