డ్రగ్స్ వ్యవహారంతో నాకు సంబంధం లేదు
ABN , Publish Date - Oct 22 , 2026 | 05:30 AM
రోకలి సత్యనారాయణ కాకినాడలో వైసీపీ కార్యకర్త. ఆయన డ్రగ్స్ ఉన్న బ్యాగుతో కేరళలో కస్టమ్స్ అధికారులకు పట్టుబడినట్లు నాకు సమాచారం ఉంది.
పట్టుబడిన రోకళ్ల సత్యనారాయణ వైసీపీ కార్యకర్తే: ద్వారంపూడి
కార్పొరేషన్(కాకినాడ), అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ‘రోకలి సత్యనారాయణ కాకినాడలో వైసీపీ కార్యకర్త. ఆయన డ్రగ్స్ ఉన్న బ్యాగుతో కేరళలో కస్టమ్స్ అధికారులకు పట్టుబడినట్లు నాకు సమాచారం ఉంది. అయితే ఆ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధం లేదు’ అని కాకినాడ సిటీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ‘ఈ వ్యవహరంలో తనకు ఎలాంటి సంబంధం లేదు. నా ప్రమేయం ఉన్నట్టు నిరూపిస్తే రాజకీయాలకు దూరమవుతా. అవసరమైతే సీబీఐతో విచారణ జరిపించాలి’ అని ద్వారంపూడి అన్నారు.
ఈ వార్తలనూ చదవండి..