తీరంలో గస్తీకి డ్రోన్లు
ABN , Publish Date - Sep 26 , 2026 | 04:34 AM
రాష్ట్రంలో మానవరహిత గస్తీ దళాలుగా డ్రోన్లను వినియోగించనున్నారు. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌లలో ఏడాది పాటు డ్రోన్లతో గస్తీని అమలు చేయాలని మౌలిక సదుపాయాల కల్పనా శాఖ నిర్ణయించింది.
కృష్ణపట్నం పోర్ట్టు, జువ్వలదిన్నె హార్బర్‌లో ఏర్పాటు
అమరావతి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మానవరహిత గస్తీ దళాలుగా డ్రోన్లను వినియోగించనున్నారు. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌లలో ఏడాది పాటు డ్రోన్లతో గస్తీని అమలు చేయాలని మౌలిక సదుపాయాల కల్పనా శాఖ నిర్ణయించింది. ఏడాది పాటు ప్రయోగాత్మకంగా కంట్రోల్ రూమ్ నుంచి డ్రోన్ల గస్తీని పరిశీలించనున్నారు. నెల్లూరు జిల్లాలో ని తీరప్రాంత పోర్టు, ఫిషింగ్ హార్బర్‌ల భద్రత ఇక పూర్తి గా డ్రోన్ల పర్యవేక్షణలో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అ త్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గల డ్రోన్ల వినియోగంపై డ్రోన్ కార్పొరేషన్ నివేదికను అందించింది. దీంతో ప్రభుత్వం కృష్ణపట్నం పోర్టు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌లలో డ్రోన్ కెమెరాల నిఘా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి కోన శశిధర్ రూ.1.44 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వు జారీ చేశారు.
ఈ వార్తలనూ చదవండి..
ఎన్నికల్లో మోదీని ఎదుర్కోలేకే.. అసత్య ప్రచారాలు: రామ్ మాధవ్
హథీరాంజీ మఠం భూ లీజుదారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ