Share News

స్వదేశానికి సురేశ్ పట్నాల మృతదేహం.. నేడు అంత్యక్రియలు..

ABN , Publish Date - Jun 19 , 2026 | 10:27 AM

ఒమన్ తీరంలో డ్రోన్ దాడిలో ముగ్గురు భారతీయులు మృతి చెందిన విషయం తెలిసిందే. వీరిలో పట్నాల సురేశ్ మృతదేహాన్ని హైదరాబాద్ మీదుగా విశాఖలోని శ్రీహరిపురంలో గల ఆయన నివాసానికి తీసుకొచ్చారు..

స్వదేశానికి సురేశ్ పట్నాల మృతదేహం.. నేడు అంత్యక్రియలు..
Visakhapatnam News

విశాఖపట్నం, జూన్ 19: ఒమన్ తీరంలో డ్రోన్ దాడిలో ముగ్గురు భారతీయులు మృతి చెందిన విషయం తెలిసిందే. వీరిలో పట్నాల సురేశ్ మృతదేహాన్ని హైదరాబాద్ మీదుగా విశాఖలోని శ్రీహరిపురంలో గల ఆయన నివాసానికి తీసుకొచ్చారు. సురేశ్‌కు భార్య భార్గవి.. 13, 10 ఏళ్ల కుమారులు ఉన్నారు. సురేష్‌ను కడసారి చూసి, నివాళులర్పించేందుకు స్థానికులు, బంధువులు, స్నేహితులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.


ఇటీవల నౌక జనరేటర్‌లో సాంకేతిక సమస్య రావడంతో దాన్ని తనిఖీ చేయడానికి సురేశ్ వెళ్లారు. ఆ సమయంలోనే అమెరికా డ్రోన్ దాడి చేయగా ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉంటూ.. కుటుంబానికి అండగా నిలుస్తున్న సురేశ్ ఇలా అకాల మరణం చెందడాన్ని అంతా జీర్ణించుకోలేకపోతున్నారు. కోరమాండల్ గేట్ సమీపంలో ఉన్న హిందూ స్మశానవాటికలో సురేశ్ అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు.


Also Read:

ఆస్పత్రులపై నిఘా పెంచాం

మలేషియాకు మంత్రి నారాయణ

Updated Date - Jun 19 , 2026 | 12:08 PM