Share News

7 కోట్ల స్కాంతో నా కుమార్తెకు సంబంధం లేదు

ABN , Publish Date - Nov 26 , 2026 | 06:40 AM

రూ.7 కోట్ల కుంభకోణం వ్యవహారంలో మరో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ఆ కేసుతో తన కూతురికి ఎలాంటి సంబంధమూ లేదని ధరణీకృష్ణ తల్లి నాగమణి ఒక వీడియో విడుదల చేశారు.

7 కోట్ల స్కాంతో నా కుమార్తెకు సంబంధం లేదు

  • ధరణీకృష్ణ తల్లి నాగమణి

మంగళగిరి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): రూ.7 కోట్ల కుంభకోణం వ్యవహారంలో మరో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ఆ కేసుతో తన కూతురికి ఎలాంటి సంబంధమూ లేదని ధరణీకృష్ణ తల్లి నాగమణి ఒక వీడియో విడుదల చేశారు. ‘స్టేట్‌మెంట్‌ ఇచ్చేందుకు నా కూతురు స్వచ్ఛందంగా మంగళగిరి పోలీసు స్టేషన్‌కు వెళ్లింది. అయితే అక్కడ మూడు రోజులు ఆమెను చిత్రహింసలు పెట్టారు. హెబియ్‌సకార్పస్‌ వేసిన తర్వాతే నా కూతురిని విడుదల చేశారు. నా కూతురికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు. ఆమెను అనవసరంగా కేసులో ఇరికించారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఈ విషయంలో జోక్యం చేసుకుని నా కూతురికి న్యాయం చేయాలి’ అని నాగమణి విజ్ఞప్తి చేశారు. ఆమె విడుదల చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఈ వార్తలనూ చదవండి:

యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్

Updated Date - Nov 26 , 2026 | 06:47 AM