Share News

15 జిల్లాల్లో 37 ఘటనలు

ABN , Publish Date - Nov 06 , 2026 | 04:52 AM

రాష్ట్రంలో జరిగిన జిల్లా, మండల పరిషత్‌ పోలింగ్‌ సందర్భంగా రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.

15 జిల్లాల్లో 37 ఘటనలు

  • అనంతపురం, కడప, కర్నూలులోనే అధికం

  • అతిక్రమించిన వారిపై చర్యలు: డీజీపీ హరీశ్‌

అమరావతి, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జరిగిన జిల్లా, మండల పరిషత్‌ పోలింగ్‌ సందర్భంగా రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రం మొత్తం మీద 15 జిల్లాల్లో 37 ఘటనలు జరిగినట్లు డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా తెలిపారు. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లోనే అధికంగా నమోదైనట్లు వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అక్రమాలకు పాల్పడే ప్రయత్నాలు ఎవరు చేసినా ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. శాంతి భధ్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టామని, వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారని చెప్పారు. ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించిన పోలీసు సిబ్బందిని అభినందించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఓటెత్తిన పల్లెలు

అభివృద్ధి చేయలేదని.. ఎన్నికల బహిష్కరణ

Updated Date - Nov 06 , 2026 | 04:54 AM