జైల్లో మతప్రచారంపై కలకలం
ABN , Publish Date - Nov 20 , 2026 | 01:24 AM
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ప్రత్యేక మహిళా కారాగారంలో మత ప్రచారం వ్యవహారంపై విచారణకు ఉన్నతాధికారులు ఆదేశించారు.
విచారణకు డీజీపీ ఆదేశం
రాజమహేంద్రవరం, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ప్రత్యేక మహిళా కారాగారంలో మత ప్రచారం వ్యవహారంపై విచారణకు ఉన్నతాధికారులు ఆదేశించారు. జైలులో క్రైస్తవ మత ప్రచారం జరుగుతోందని, మత మార్పిడికి దాదాపు 20 మంది ఖైదీలను సిద్ధం చేశారని, ఈ తంతుకు స్వయంగా జైలు సూపరింటెండెంట్ వసంత కుమారి సారథ్యం వహిస్తున్నారంటూ ‘జైలులో మత ప్రచారం’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ మెయిన్ ఎడిషన్లో గురువారం వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ కథనం జైళ్ల శాఖలో కలకలం రేపింది. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా విచారణకు ఆదేశించారు. కడప మహిళా ప్రత్యేక జైలు సూపరింటెండెంట్ కృష్ణవేణిని విచారణ అధికారిగా నియమిస్తూ ఆదేశాలిచ్చారు.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీ తీరానికి అక్వాన్ తుపాను ముప్పు.. గోపాల్పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం: ఏపీఎస్డీఎంఏ
బాలకృష్ణకు విశిష్ట పురస్కారం.. రేవంత్ సర్కార్ నుంచి అరుదైన గౌరవం