Share News

శ్రీశైలంలో అన్నదాన పథకానికి భారీ విరాళాలు

ABN , Publish Date - Nov 16 , 2026 | 05:38 AM

శ్రీశైల దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన ప్రసాద వితరణ పథకానికి ఇద్దరు భక్తులు భారీ విరాళం అందించారు.

శ్రీశైలంలో అన్నదాన పథకానికి భారీ విరాళాలు

శ్రీశైలం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన ప్రసాద వితరణ పథకానికి ఇద్దరు భక్తులు భారీ విరాళం అందించారు. హైదరాబాద్‌కు చెందిన మాధవరావు రూ.10 లక్షల విరాళాన్ని చెక్కు రూపంలో ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేశ్‌నాయుడు, ఈవో శ్రీనివాసరావుకు అందజేశారు. అలాగే హైదరాబాద్‌కే చెందిన నర్సింగ్‌రావు కుటుంబ సభ్యులు రూ.4 లక్షల విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. దాతలకు దేవస్థానం తరపున స్వామి, అమ్మవార్ల ప్రత్యేక దర్శనం కల్పించి, లడ్డూ ప్రసాదాలు, పరిమళ విభూది, శేషవస్త్రాలు, జ్ఞాపిక, రసీదును అందజేశారు.

ఈ వార్తలనూ చదవండి:

సొంత వైద్యం.. ప్రాణాలకే ముప్పు

ఏపీలో జోరుగా పంచాయతీ ఎన్నికల నామినేషన్లు..!

Updated Date - Nov 16 , 2026 | 05:38 AM