Share News

11 సీట్లు ఇచ్చినా ఇంకా జ్ఞానోదయం కాలేదు: దేవినేని ఉమామహేశ్వరరావు

ABN , Publish Date - Mar 28 , 2026 | 08:55 PM

అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ శాసనసభలో తీర్మానం చేయటం చారీత్రాత్మక నిర్ణయమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. కూటమి ప్రభుత్వం ఐదు కోట్ల మంది ఆంధ్రుల ఆకాంక్షను నేరవేర్చిందని పేర్కొన్నారు.

11 సీట్లు ఇచ్చినా ఇంకా జ్ఞానోదయం కాలేదు: దేవినేని ఉమామహేశ్వరరావు
Devineni Uma Maheswara Rao

అమరావతి, మార్చి 28: అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ శాసనసభలో తీర్మానం చేయటం చారీత్రాత్మక నిర్ణయమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. కూటమి ప్రభుత్వం ఐదు కోట్ల మంది ఆంధ్రుల ఆకాంక్షను నేరవేర్చిందని పేర్కొన్నారు. అసెంబ్లీకి గైర్హాజరుతో అమరావతిపై వైసీపీ కుట్రకోణం బయటపడిందని అన్నారు.


శనివారం దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతూ.. ‘అధికారం వ్యామోహం తప్ప వైసీపీకి రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు. ఐదేళ్లు కుట్రలు, కుతంత్రాలతో ప్రజారాజధానిపై విషం చిమ్మారు. ప్రజలు 11 సీట్లు ఇచ్చినా ఇంకా జ్ఞానోదయం కాని వైసీపీకి రాజకీయపార్టీగా ఉండే అర్హత లేదు. పార్టీ పెట్టిన 9నెలలో అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం. ఎన్నో ఆటుపోటులను తట్టుకుంటూ 44 ఏళ్లుగా నిలబడ్డ చరిత్ర టీడీపీది’ అని అన్నారు.


కాగా, రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానాన్ని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పంపింది. కేంద్ర హోం శాఖ మంత్రి, రాజ్యసభ చైర్మన్, లోక్‌సభ స్పీకర్‌కు శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీర్మానాన్ని పంపించారు.

ఇవి కూడా చదవండి

జాతీయ ఫుట్ బాల్ ప్లేయర్ ఇంటిపై అల్లరి మూకలు దాడి..

పాక్ ఇంకా ఉగ్రవాద సంస్థలకు షెల్టర్ ఇస్తోంది.. భారత్‌కు అమెరికా నివేదిక హెచ్చరిక..

Updated Date - Mar 28 , 2026 | 09:16 PM