Share News

గోదావరి తీర గ్రామాలకు మరో రూ.100 కోట్లు మంజూరు చేయించిన పవన్ కల్యాణ్

ABN , Publish Date - Sep 01 , 2026 | 04:44 PM

గోదావరి తీర ప్రాంత గ్రామాల అభివృద్ధి కోసం ఉపముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం మరో రూ.100 కోట్ల నిధులను మంజూరు చేయించారు. గ్రామీణాభివృద్ధి పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అని కూటమి పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గోదావరి తీర గ్రామాలకు మరో రూ.100 కోట్లు మంజూరు చేయించిన పవన్ కల్యాణ్

అమరావతి, సెప్టెంబర్,1: దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు.. దేశ అభివృద్ధి గ్రామాల అభివృద్ధితోనే సాధ్యమవుతుందన్న గాంధీజీ మాటలను ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి చేతల్లో చూపిస్తున్నారు. గోదావరి తీర ప్రాంతంలోని గ్రామాలను అభివృద్ధి చేయడానికి ఇప్పటికే ఏపీపీసీబీ ద్వారా రూ.100 కోట్ల నిధులను మంజూరు చేయించిన పవన్.. ఇప్పుడు మరో రూ.100 కోట్ల నిధులను మంజూరు చేయించారు.

ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. మొత్తం నిధులలో రూ.90 కోట్ల నిధులను పంచాయతీరాజ్ శాఖ మంజూరు చేయగా, రూ.10 కోట్లను ఆర్‌డబ్ల్యూఎస్ నుంచి మంజూరు చేయించారు. ఈ నిధులను గోదావరి తీర ప్రాంతంలోని ఏడు నియోజకవర్గాల అభివృద్ధికి కేటాయించనున్నారు. మొత్తం రూ.100 కోట్లలో గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి రూ.90 కోట్లను కేటాయించనున్నట్లు ఉపముఖ్యమంత్రి పవన్ తెలిపారు. మిగిలిన రూ.10 కోట్లలతో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సదుపాయాలను కల్పిస్తామని ఆయన తెలిపారు.

Updated Date - Sep 01 , 2026 | 04:49 PM