Share News

‘మురసు’ ముంచేసింది.. ఆదుకోండి

ABN , Publish Date - Nov 14 , 2026 | 01:18 AM

మురసు తుఫానుతో తీవ్రంగా నష్టపోయామని, తమను ఆదుకోవాలని రైతులు కేంద్ర బృందాన్ని కోరారు. తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలు, ఇతర నష్టాల్ని అంచనా వేయడానికి కేంద్ర బృందం...

‘మురసు’ ముంచేసింది.. ఆదుకోండి

కేంద్ర బృందాన్ని కోరిన ఏలూరు, బాపట్ల జిల్లాల రైతులు

బాపట్ల, ఏలూరు, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): మురసు తుఫానుతో తీవ్రంగా నష్టపోయామని, తమను ఆదుకోవాలని రైతులు కేంద్ర బృందాన్ని కోరారు. తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలు, ఇతర నష్టాల్ని అంచనా వేయడానికి కేంద్ర బృందం సభ్యులు శుక్రవారం బాపట్ల, ఏలూరు జిల్లాల్లో పర్యటించారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రటరీ చిత్తరంజన్‌దాస్ సారథ్యంలోని బృందం బాపట్ల జిల్లాలో పర్యటించింది. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన తుఫాను నష్టాల ఫొటో ఎగ్జిబిషన్‌ను బృందం పరిశీలించింది.

కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఆయా విభాగాల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో నష్టాలపై సమీక్ష జరిపారు. జిల్లావ్యాప్తంగా రూ.320 కోట్లు నష్టం వాటిల్లినట్లు అధికారులు కేంద్ర బృందానికి తెలిపారు. ఆతర్వాత క్షేత్రస్థాయి పర్యటనకు బయలుదేరిన బృందం.. బాపట్ల మండలం జమ్ములపాలెంలో దెబ్బతిన్న వరి పొలాలను చూసి, రైతులతో మాట్లాడింది. చీరాలలో దెబ్బతిన్న బోట్లను పరిశీలించి మత్స్యకారులతో మాట్లాడారు. చినగంజాం మండలం కడవకుదురులో దెబ్బతిన్న మామిడి తోటలను పరిశీలించారు.

కారంచేడు మండలం పర్చూరులో దెబ్బతిన్న ఇళ్లను చూశారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కేంద్ర బృందం వెంటే ఉండి తుఫాను నష్టాన్ని వారికి వివరించారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలోని మూడు మండలాల్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ అలోక్‌ జవహర్‌ నాయకత్వంలోని బృందం పర్యటించింది. నిడమర్రు, ఉంగుటూరు, భీమడోలు మండలాల్లో పంటలను, రావులపర్రులో ఫొటో ఎగ్జిబిషన్‌ను బృందం సభ్యులు తిలకించారు.

రెండు తుఫాన్లతో తీవ్రంగా నష్టపోయాయమని రైతులు మొరపెట్టుకున్నారు. నిడమర్రు మండలం అడవికొలనులో 450 ఎకరాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని, ఎకరానికి రూ.35వేలు నష్టపోయాయమని రైతులు తెలిపారు.


గేదెలు తినడానికీ పనికిరాదు

జమ్ములపాలెంలో దెబ్బతిన్న వరిని కేంద్ర బృందం పరిశీలించి, ఈ పైరు దేనికైనా పనికొస్తుందా? అని రైతులను ప్రశ్నించగా.. గేదెలు తినడానికి కూడా పనికిరాని విధంగా కుళ్లిపోయిందని, పరిహారమిచ్చి ఆదుకోవాలని రైతులు కోరారు.

ఈ వార్తలనూ చదవండి:

‘గుర్తు’ పట్టకపోతే నష్టం!

జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: మంత్రి లోకేశ్

Updated Date - Nov 14 , 2026 | 01:20 AM