ప్రయాణికుల అవస్థలు
ABN , Publish Date - Oct 30 , 2026 | 06:04 AM
తుఫాన్ ప్రభావంతో గురువారం కూడా పలు రైళ్లు రద్దయ్యాయి. అటు భువనేశ్వర్, ఇటు విశాఖ, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై వెళ్లాల్సిన రైళ్లను రైల్వేశాఖ రద్దుచేసింది.
విశాఖపట్నం, ఇచ్ఛాపురం, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): తుఫాన్ ప్రభావంతో గురువారం కూడా పలు రైళ్లు రద్దయ్యాయి. అటు భువనేశ్వర్, ఇటు విశాఖ, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై వెళ్లాల్సిన రైళ్లను రైల్వేశాఖ రద్దుచేసింది. చివరకు ప్యాసింజర్ రైళ్లు సైతం రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. విశాఖ-భువనేశ్వర్ వందేభారత్ (20842), విశాఖ-డిఘా ఎక్స్‌ప్రెస్(22874), విశాఖ-బ్రహ్మపూర్ పాసింజర్(58532), విశాఖ-బ్రహ్మపూర్ ఎక్స్‌ప్రెస్(18526), భువనేశ్వర్-విశాఖ వందేభారత్(20841), సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్(17016), సికింద్రాబాద్-హౌరా ఫలక్‌నూమా ఎక్స్‌ప్రెస్(12704), బ్రహ్మపూర్-విశాఖ ఎక్స్‌ప్రెస్ (18525), బ్రహ్మపూర్-విశాఖ పాసింజర్ (58531) రద్దయ్యాయి.
చెన్నై-హౌరా, రూర్కెలా-గుణుపూర్ రాజారాణి ఎక్స్‌ప్రెస్, హౌరా-చర్లపల్లి, సంత్రాగచ్-యర్నాకుళం, ఖరగ్‌పూర్-విల్లుపురం రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. పూరి-అహ్మదాబాద్ రైలును అంగోళ్-సంబల్‌పూర్-విజయనగరం మీదుగా దారి మళ్లించారు. బెంగుళూరు-భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రె్‌సను టిట్నాగర్-విజయనగరం మీదుగా దారి మళ్లించారు. భువనేశ్వర్-ముంబై కోణార్క్‌ఎక్స్‌ప్రె్‌సను ఆలస్యంగా నడిపించినట్లు రైల్వేశాఖ ప్రకటించింది. పలాసలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ట్రైన్‌లో విద్యుత్‌ను నిలుపుదల చేయడంతో ప్రయాణికులు ప్లాట్‌ఫారాలపైకి చేరుకుని నిరసన తెలిపారు.
దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌కు మరమ్మతులు
ఇచ్ఛాపురం, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో బాహుదా నది సమీప రైల్వే ట్రాక్ పాక్షికంగా దెబ్బతింది. రైల్వే వంతెన సమీపంలో ట్రాక్ కింద పిల్లర్లు దెబ్బతినడంతో పాటు రాళ్లు కూడా కొట్టుకుపోయాయి. దీంతో రైల్వేట్రాక్‌కు పగుళ్లు ఏర్పడ్డాయి. విశాఖపట్నం నుంచి రైల్వే రిలీఫ్ ట్రైన్‌లో వచ్చిన అధికారులు, సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టారు.
ఈ వార్తలనూ చదవండి:
తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు
ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు