Share News

తుఫానుతో విద్యుత్తు శాఖకు రూ.3.96 కోట్ల నష్టం

ABN , Publish Date - Sep 26 , 2026 | 05:14 AM

తుఫాను కారణంగా ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో విద్యుత్తు శాఖ మౌలిక వసతులకు సుమారు రూ.3.96 కోట్ల నష్టం ...

తుఫానుతో విద్యుత్తు శాఖకు రూ.3.96 కోట్ల నష్టం

అమరావతి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): తుఫాను కారణంగా ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో విద్యుత్తు శాఖ మౌలిక వసతులకు సుమారు రూ.3.96 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా గుర్తించామని ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ తెలిపారు. ఉత్తరాంధ్రలో ఏర్పడిన విద్యుత్తు అంతరాయాలపై 24 గంటల్లోనే 100 శాతం సరఫరాను పునరుద్ధరించామని వివరించారు.

  • విద్యుత్తు వినియోగం 192 మిలియన్‌ యూనిట్లు!

వర్షాలతో తగ్గిన వినియోగం.. డిస్కంలకు భారీ ఊరట

రాష్ట్ర విద్యుత్తు సంస్థలకు ఇటీవల కురిసిన వర్షాలు భారీ ఊరట కలిగించాయి. విద్యుత్తు వినియోగం గురువారం ఒక్కసారిగా 192 మిలియన్‌ యూనిట్లకు పడిపోయింది. గత మూడు రోజులుగా వర్షాలతో వాతావరణం చల్లబడటంతో విద్యుత్తు వాడకం బాగా తగ్గింది. ఈ నెల ప్రారంభంలో నమోదైన 297 ఎంయూల గరిష్ఠ వినియోగంతో ఉక్కిరిబిక్కిరి అయిన విద్యుత్తు సంస్థలకు ఉపశమనం లభించినట్లయింది.

ఈ వార్తలనూ చదవండి..

ఎన్నికల్లో మోదీని ఎదుర్కోలేకే.. అసత్య ప్రచారాలు: రామ్ మాధవ్

హథీరాంజీ మఠం భూ లీజుదారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ

Updated Date - Sep 26 , 2026 | 05:14 AM