Share News

పుట్టిన రోజు నాడే..

ABN , Publish Date - Oct 29 , 2026 | 06:27 AM

విశాఖపట్నం జీవీఎంసీ 120వ వార్డు పరిధిలోని ఓ ఇంటి సమీపాన బుధవారం వేకువజామున విద్యుత్‌ స్తంభం నేలకొరిగింది. ఇంట్లోని చెత్తను పారేయడానికి గేటు బయటకు వచ్చిన మాధవి విద్యుత్‌ వైర్లు తగిలి మృతిచెందారు.

పుట్టిన రోజు నాడే..

విశాఖపట్నం జీవీఎంసీ 120వ వార్డు పరిధిలోని ఓ ఇంటి సమీపాన బుధవారం వేకువజామున విద్యుత్‌ స్తంభం నేలకొరిగింది. ఇంట్లోని చెత్తను పారేయడానికి గేటు బయటకు వచ్చిన మాధవి విద్యుత్‌ వైర్లు తగిలి మృతిచెందారు. బుధవారం ఆమె పుట్టినరోజు. అదేరోజు మృతి చెందడంతో భర్త, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

వద్దన్నా వెళ్లి.. గల్లంతు

తుఫాన్‌ హెచ్చరికలను లెక్కచేయకుండా కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చొల్లంగిపేటకు చెందిన మత్స్యకారులు ముగ్గురు చేపలవేటకు వెళ్లి గల్లంతయ్యారు. నీలపల్లి గంగరాజు(42), నీలపల్లి ప్రసాద్‌ (17) తండ్రీకొడుకు కాగా, డొంకా రాజ(31) బోటుపై కోరింగ పంచాయతీ పరిధిలోని హోప్‌ ఐల్యాండ్‌ ప్రాంతానికి చేపల వేటకు వెళ్లారు.

ఈ వార్తలనూ చదవండి:

పోటాపోటీ

ఆర్నబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ఊరట

Updated Date - Oct 29 , 2026 | 06:27 AM