26న ‘చలో విజయవాడ’కు సీపీఐ పిలుపు
ABN , Publish Date - Oct 02 , 2026 | 05:30 AM
రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలకు శ్రీకారం చుట్టినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య తెలిపారు. ప్రధానంగా ఇళ్ల స్థలాలు,...
అమరావతి, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలకు శ్రీకారం చుట్టినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య తెలిపారు. ప్రధానంగా ఇళ్ల స్థలాలు, టిడ్కో ఇళ్లు, కరువు, 22ఎ నిషేధిత భూముల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 26న ‘చలో విజయవాడ’కు పిలుపునిచ్చారు. గురువారం విజయవాడలోని దాసరి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈశ్వరయ్య మాట్లాడారు. గ్రామీణ పేదలకు 3 సెంట్లు, పట్టణ పేదలకు 2 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించాలనే డిమాండ్‌తో ఈ నెల 8 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆయన తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
వివేకా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. వారికి నోటీసులు