విద్యుదాఘాతానికి భార్యాభర్తలు బలి
ABN , Publish Date - Oct 30 , 2026 | 06:10 AM
విద్యుదాఘాతానికి గురై భార్యాభర్తలు మృతిచెందారు. ఈ ఘటన గురువారం తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో చోటుచేసుకుంది.
గోపాలపురం, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): విద్యుదాఘాతానికి గురై భార్యాభర్తలు మృతిచెందారు. ఈ ఘటన గురువారం తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... గోపాలపురంలోని కుమ్మరికుంటలో పెంటబోయిన పెద్ద బంగారయ్య (57), ఆయన భార్య అప్పల నర్సమ్మ(53) నివసిస్తున్నారు. గురువారం ఉదయం నర్సమ్మ బట్టలు ఉతికి ఇంటిపైన వాటిని ఆరబెడతుండగా ప్రమాదవశాత్తు అవి విద్యుత్తు తీగలకు తగిలాయి. గమనించిన బంగారయ్య విద్యుదాఘాతానికి గురైన తన భార్యను కాపాడేందుకు ప్రయత్నించగా ఇద్దరూ విద్యుదాఘాతానికి గురై మృతిచెందారు.
ఈ వార్తలనూ చదవండి:
తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు
ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు