అప్పన్న ఆలయ ధ్వజ స్తంభ పీఠం స్వర్ణమయం
ABN , Publish Date - Nov 27 , 2026 | 01:23 AM
ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవాలయ ధ్వజ స్తంభ పీఠాన్ని స్వర్ణమయం కావించారు. ప్రముఖ వ్యాపార సంస్థ ‘సీఎంఆర్’ అధినేత మావూరి వెంకటరమణ గతంలో ధ్వజ స్తంభ పైభాగాన్ని స్వర్ణ మయం చేశారు.
సుమారు రూ.2 కోట్లు వెచ్చించిన ‘సీఎంఆర్’
సింహాచలం, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవాలయ ధ్వజ స్తంభ పీఠాన్ని స్వర్ణమయం కావించారు. ప్రముఖ వ్యాపార సంస్థ ‘సీఎంఆర్’ అధినేత మావూరి వెంకటరమణ గతంలో ధ్వజ స్తంభ పైభాగాన్ని స్వర్ణ మయం చేశారు. తాజాగా 509.6 గ్రాముల స్వర్ణంతో పీఠానికి కూడా స్వర్ణ తాపడం చేయించారు. దేవాలయ వైదికులు సంప్రోక్షణ నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపిన తరువాత స్వర్ణ రేకులను అతికించారు. ఈ సందర్భంగా మావూరి వెంకటరమణ మాట్లాడుతూ చెన్నైకు చెందిన నిపుణులైన స్వర్ణకారులు సుమారు ఏడాదిపాటు శ్రమించి తాపడానికి కావలసిన రేకులను సిద్ధం చేశారని తెలిపారు. ఇందుకు సుమారు రూ.2 కోట్లు అయినట్టు, . గతంలో వెచ్చించిన మొత్తంతో కలిపితే సుమారు రూ.4 కోట్లు అయిందని వెల్లడించారు. అంతకుముందు మావూరి వెంకటరమణ దంపతులు అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కప్ప స్తంభ ఆలింగనం, గోదాదేవి అమ్మవారి దర్శనం తరువాత ఆలయ పండితులు వేదాశీర్వచనాలీయగా అధికారులు శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
ఈ వార్తలనూ చదవండి:
2019, 2020 నంది అవార్డుల ఎంపికకు జ్యూరీ కమిటీ ఏర్పాటు
బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోసిన వైసీపీ నేతలు.. పోలింగ్ వాయిదా