కూటమిగా నిలిచాం.. ఐక్యంగా గెలిచాం
ABN , Publish Date - Nov 22 , 2026 | 01:41 AM
ప్రజల కోసం పనిచేేసే ప్రభుత్వానికి ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటారని స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు మరోసారి నిరూపించాయని ...
సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు ప్రజలు పట్టం
సామాన్య కార్యకర్తలను జెడ్పీ పీఠాలపై కూర్చోబెట్టాం
వైసీపీ కుట్రలను తిప్పికొట్టిన ఓటర్లకు హ్యాట్సాఫ్
మా బాధ్యత పెరిగింది: సీఎం చంద్రబాబు
పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా ప్రజలు కూటమి అభ్యర్థులను అక్కున చేర్చుకున్నారు. ఈ విజయం రెండేళ్ల పాలనకు ప్రజలు ఇచ్చిన ప్రతిఫలంగా భావిస్తున్నాం. ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు మరింత బాధ్యతతో పనిచేస్తాం.
- సీఎం చంద్రబాబు
అమరావతి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): ప్రజల కోసం పనిచేేసే ప్రభుత్వానికి ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటారని స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు మరోసారి నిరూపించాయని సీఎం చంద్రబాబు అన్నారు. సంక్షేమం, అభివృ ద్ధి, సుపరిపాలనకు ప్రజలు పట్టం కట్టారన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల కంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి మరింత ఆదరణ లభించడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై శనివారం మీడి యా సమావేశం నిర్వహించారు.
ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా, పోస్టల్ బ్యాలెట్ అయినా ప్రజల తీర్పు కూటమికి అనుకూలంగానే ఉందన్నారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూటమి 96.42 శాతం స్ట్రయిక్ రేట్ సాధించిందని, ఎంపీపీల్లో 93.15 శాతం స్థానాలను గెలుచుకుందని వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ 94 శాతం స్ట్రయిక్ రేట్ నమోదు చేసినట్లు తెలిపారు. 2024 ఎన్నికల్లో వైసీపీకి 39.81 శాతం ఓట్లు రాగా, ప్రస్తుత స్థానిక ఎన్నికల్లో అది 33.56 శాతానికి పడిపోయిందని, ఆ పార్టీకి 6.25 శాతం ఓట్లు తగ్గాయని వివరించారు. కూటమి సాధించిన విజయంతో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడిందని సీఎం వ్యాఖ్యానించారు.
చెప్పాం... చేశాం... చేస్తాం
‘కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, చేపడుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సుపరిపాలనను ప్రజలు గుర్తించారు. చెప్పినవి చేస్తు న్నాం.. చేయాల్సినవి చేస్తాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన విషయంలో ఎక్కడా రాజీపడబోం. గత పాలకులు తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో ప్రజల భూముల భద్రతను ప్రశ్నార్థకం చేశారు. ఆ చట్టాన్ని రద్దు చేసి, రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను అందిస్తు న్నాం. తీవ్రస్థాయిలో ఎల్‌నినో ప్రభావంతో పా టు వరుసగా రెండు తుఫాన్లు రాష్ట్రాన్ని తాకినప్పటికీ ప్రభుత్వం తక్షణమే స్పందించింది. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి సాధారణ పరిస్థితులు పునరుద్ధరించేందుకు కృషి చేశాం. గత ప్రభుత్వం రూ.1.30 లక్షల కోట్లకు పైగా అప్పులతో విద్యుత్ సంస్థలను నష్టాల్లోకి నెట్టింది. ప్రజలపై రూ.32 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారం మోపారు. మేం విద్యుత్ చార్జీలు పెంచలేదు’ అన్నారు.
ప్రజల అజెండానే.. ప్రభుత్వ అజెండా
‘ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయ డం, అన్ని వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించడం, అభివృద్ధి ఫలాలను ప్రతి కుటుంబానికి చేరవేయడం ద్వారా ప్రజల నమ్మకాన్ని మరింత పెంచుకుంటాం. స్థానిక ఎన్నికల్లో లభించిన ఘన విజయం కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఉంచిన విశ్వాసానికి ప్రతీక. ఇటీవల ఒక ఓటరు అభ్యర్థి ఇచ్చిన డబ్బును తన ఓటుతో సహా బ్యాలెట్ బాక్సులో వేసి తిరస్కరించ డం ప్రజల్లో వస్తున్న చైతన్యానికి నిదర్శనం. స్థానిక సంస్థల పదవుల ఎంపికలో కులం, వర్గం, ప్రాంతం, మహిళా ప్రాతినిధ్యంతో పాటు అభ్యర్థుల విద్యార్హతలు, వయసు, అంకితభావం, పార్టీకి చేసిన సేవలను పరిగణనలోకి తీసుకు న్నాం.
జనాభా దామాషా ప్రకారం బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు తగిన ప్రాధాన్యం కల్పించాం. రాజ్యాధికారంలో తమకూ భాగస్వా మ్యం దక్కిందన్న సంతృప్తి అన్ని వర్గాల్లో కలగాలన్నదే మా ఉద్దేశం. చట్టసభల్లోనే కాకుండా స్థానిక సంస్థల్లోనూ ఆయా వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తున్నాం. కర్నూలుజడ్పీ వైస్ చైౖర్‌పర్సన్‌గా ఎంబీబీఎస్ పూర్తి చేసిన షేక్ షాదికను ఎంపిక చేశాం. 22 జడ్పీ చైౖర్‌పర్సన్ స్థానాలకు గాను 12 స్థానాలను మహిళలకు కేటాయించాం. మొత్తం 14 మంది గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. 20 జడ్పీ వైస్ చైర్ పర్సన్ స్థానాలకు గాను 11 స్థానాలను మహిళలకు ఇచ్చాం. 17 మంది ఉన్నత విద్యావంతులు ఉన్నారు’ అని వివరించారు.
కొందరు ఎమ్మెల్యేలకు హెచ్చరిక
బలవంతపు మత మార్పిళ్ల ద్వారా కొందరు ఆ ప్రాంత ప్రజలను ప్రలోభ పెడుతున్నారని విమర్శించారు. ప్రజాప్రతినిధుల పనితీరును కూడా అంచనా వేస్తున్నామని, కొందరు ఎమ్మెల్యేల పనితీరును ప్రజలు మెచ్చలేదని, అలాంటి వారు తమను తాము సరిదిద్దుకోవాలని చంద్రబాబు హెచ్చరించారు. ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో గొడ్డలి పార్టీ వివిధ విన్యాసాలు చేసింది. కుట్రలు, కుతంత్రాలతో 63 పిటిషన్లు వేసి స్థానిక ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నం చేసిం ది. హింసకు పాల్పడింది వైసీపీనే.. ఫిర్యాదు చేసింది వైసీపీనే. ఈ డ్రామాలను ప్రజలు విశ్వసించలేదు. వైసీపీ కుట్రలను తిప్పికొట్టిన ప్రజలకు హ్యాట్సాఫ్. స్థానిక సంస్థల్లో ప్రజాతీర్పుతో మా బాధ్యత పెరిగింది’ అని సీఎం చెప్పారు. సామాన్య కార్యకర్తలకు ఈ ఎన్నికల్లో మంచి అవకాశాలు కల్పించామని తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
బెంగళూరుకు షర్మిల.. అడ్డుకునేందుకు జగన్ భారీ స్కెచ్..?
కేబీసీ సీజన్ 18 మొదటి కోటీశ్వరుడిగా యూపీఎస్సీ అభ్యర్థి