ఉద్యాన తోటల పునరుద్ధరణకు సాయం చేయండి
ABN , Publish Date - Nov 21 , 2026 | 05:17 AM
రెండు వరుస తుఫాన్‌ల కారణంగా దెబ్బతిన్న ఉద్యాన తోటల పునరుద్ధరణకు వివిధ కేంద్ర పథకాల కింద ఏపీకి అదనపు సాయంగా రూ.96.33 కోట్లు అందించాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరారు
కేంద్ర వ్యవసాయశాఖ మంత్రికి సీఎం లేఖ
అమరావతి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): రెండు వరుస తుఫాన్‌ల కారణంగా దెబ్బతిన్న ఉద్యాన తోటల పునరుద్ధరణకు వివిధ కేంద్ర పథకాల కింద ఏపీకి అదనపు సాయంగా రూ.96.33 కోట్లు అందించాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు శుక్రవారం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు చంద్రబాబు లేఖ రాశారు. ఇటీవల అర్నబ్, మురసు తుఫాన్ల వల్ల రాష్ట్రంలో ఉద్యాన పంటలకు భారీ నష్టం వాటిల్లిందని లేఖలో పేర్కొన్నారు. ఈ రెండు తుఫాన్ల ధాటికి 18 జిల్లాల్లో 29,960 హెక్టార్టలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని. దీనివల్ల 71,576 మంది రైతులు నష్టపోయారని కేంద్రమంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. అర్నబ్ ప్రభావంతో 215 మండలాల్లో 23,211 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని, ఒక్క అరటి పంటే 15,549 హెక్టార్లలో నష్టపోయిందని వివరించారు. మురసు తుఫాన్ ప్రభావంతో 108 మండలాల్లోని 6,748 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్‌పై సైబర్ దాడి.. కస్టమర్ల సమాచారం లీక్!
ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్.. 37 గంటల మిషన్‌లో ఏం జరిగిందంటే..