Share News

ముంపు సమస్యలను త్వరగా పరిష్కరించండి ముంపు సమస్యలను త్వరగా పరిష్కరించండి

ABN , Publish Date - Nov 05 , 2026 | 06:42 AM

మురసు తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ముంపు సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

 ముంపు సమస్యలను త్వరగా పరిష్కరించండి ముంపు సమస్యలను త్వరగా పరిష్కరించండి

మురసు తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ముంపు సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలకు వివిధ వాగులు, కాలువలకు వరద ప్రవాహాలు పెరిగాయని అధికారులు సీఎంకు తెలిపారు. ఎర్రకాలువ, గోనెలవాగు తదితర ప్రాంతాలకు నీటిప్రవాహాలు వస్తున్నాయన్నారు. తెలంగాణలో కురిసిన వర్షాల వల్ల పలు కాలువలకు వరద నీరు వచ్చే అవకాశం ఉందని వివరించారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వాగులు, కాలువలు, వంకలకు వస్తున్న వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు బుధవారం రాత్రి అధికారులతో మాట్లాడారు.

ఈ వార్తలనూ చదవండి:

ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ.. సుప్రీంకోర్టులో పిటిషన్

ఫోర్జరీ, చీటింగ్‌ కేసులో సులోచన సహా ముగ్గురికి రిమాండ్‌

Updated Date - Nov 05 , 2026 | 06:50 AM