మురసు ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు ఏరియల్ సర్వే
ABN , Publish Date - Nov 05 , 2026 | 06:40 AM
మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు బుధవారం ఏరియల్ సర్వే నిర్వహించా రు. ఉండవల్లి క్యాంప్ కార్యాలయం నుంచి హెలీకాప్టర్‌లో బయల్దేరి తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు వెళ్లారు.
గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో సీఎం పరిశీలన
అమరావతి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు బుధవారం ఏరియల్ సర్వే నిర్వహించా రు. ఉండవల్లి క్యాంప్ కార్యాలయం నుంచి హెలీకాప్టర్‌లో బయల్దేరి తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు వెళ్లారు. హెలీకాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు వాతావరణం సహకరించకపోవడంతో ఏరియల్ వ్యూ ద్వారా తుఫాన్ నష్టాలను పరిశీలించారు. గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లోని చిలకలూరిపేట, ఒంగోలు, కొత్తపట్నం, చినగంజాం, చీరాల, బాపట్ల ప్రాంతాల్లో తుఫాన్ నష్టాన్ని పరిశీలించారు. వివిధ ప్రాంతాల్లో నీట మునిగిన పంటలు, గ్రామాలను చుట్టిముట్టిన నీరు, జలదిగ్బంధమైన రోడ్లను ఏరియల్ వ్యూ ద్వారా సీఎం చూశారు. ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి తుఫాన్ ప్రభావం, సహాయక చర్యలపై అధికారులతో సమీక్షించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ.. సుప్రీంకోర్టులో పిటిషన్
ఫోర్జరీ, చీటింగ్ కేసులో సులోచన సహా ముగ్గురికి రిమాండ్