Share News

చర్చ జరిగే ఆరు అంశాలివీ..

ABN , Publish Date - Nov 12 , 2026 | 05:11 AM

పెవిలియన్‌, ఎంఎస్ఎంఈ ఉత్పత్తుల ప్రదర్శనల ప్రారంభంతో సదస్సు కార్యక్రమాలు మొదలవుతాయి.

చర్చ జరిగే ఆరు అంశాలివీ..

  1. వాణిజ్యం -పెట్టుబడులు- గ్లోబల్‌ వాల్యూ చైన్స్‌

  2. ట్రాన్స్‌ జియో ఎకనామిక్స్‌-గ్లోబల్‌ కోఆపరేషన్‌

  3. వ్యవసాయం-ఆహార భద్రత-జీవ ఆధారిత ఆర్థిక వ్యవస్థ

  4. ప్రతిభ-నైపుణ్యాలు-అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు

  5. సాంకేతికత- ఆవిష్కరణలు-భవిష్యత్‌ పరిశ్రమలు

  6. స్వచ్ఛ ఇంధనం-సుస్థిర వృద్ధి-ప్రపంచ ఆర్థిక మార్పులకు

  7. అనుగుణంగా ఏపీ పారిశ్రామిక రంగానికి నూతన దిశానిర్దేశం

  • సదస్సు రెండు రోజులు ఇలా..

పెవిలియన్‌, ఎంఎస్ఎంఈ ఉత్పత్తుల ప్రదర్శనల ప్రారంభంతో సదస్సు కార్యక్రమాలు మొదలవుతాయి. అనంతరం ప్రారంభ సభ, విదేశీ వాణిజ్య మంత్రులతో ప్రత్యేక ప్లీనరీ నిర్వహిస్తారు. ఓడరేవులు-నౌకా నిర్మాణం, ఇంధనం, విమానయానం, భద్రత, ఆహార వ్యవస్థలు, నదుల అనుసంధానం, యువత శ్రేయస్సుపై సెషన్లు జరుగుతాయి. ఇవి కాకుండా జపాన్‌, అరబ్‌ ఎమిరేట్స్‌, రష్యా, యూరప్‌, ఆఫ్రికా దేశాల ప్రతినిధులతో ప్రత్యేక సెషన్లు ఏర్పాటుచేశారు. ఇక రెండో రోజు పీ4, పేదరికం నిర్మూలనపై ముఖ్యమంత్రితో ముఖాముఖి (ఫైర్‌ సైడ్‌ చాట్‌) ఉంటుంది. దీంతో పాటు అంతరిక్షం, ఏఐ, క్వాంటం కంప్యూటింగ్‌, స్కిల్‌ డెవల్‌పమెంట్‌, పర్యాటకం, ఇంధన రంగ స్థిరత్వంపై సమావేశాలు ఉంటాయి. మంత్రి లోకేశ్‌తో లైవ్‌ పాడ్‌ కాస్ట్‌ నిర్వహిస్తారు.


సర్వాంగ సుందరంగా విశాఖ

పారిశ్రామిక భాగస్వామ్య సదస్సుకు విశాఖ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఏపీ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా విదేశీ అతిథులకు స్వాగతం పలికేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. గిరిజన థింసా నృత్యం, గరగ నృత్యం, తప్పెట గుళ్లు తదితర సంప్రదాయ నృత్యాలు ఆహూతులను కట్టిపడేయనున్నాయి. ఏపీ తీర ప్రాంతం, ఏపీ ఆతిథ్యం, ఆహార రుచులు, అమరావతి వైభవం, నూతన రాజధాని, కడియం నర్సరీ లాంటి ప్రత్యేకతలను ప్రదర్శించేలా ఏర్పాట్లు చేశారు.

వ్యవసాయం, ఉద్యాన పంటలు, అరకు కాఫీ, టూరిజం, లాజిస్టిక్స్‌, సోలార్‌ తదితర అంశాల స్టాళ్లు నెలకొల్పారు. ప్రధాన ప్లీనరీ హాల్‌తో పాటు పారిశ్రామిక వేత్తలు చర్చలు జరిపేలా వివిధ సమావేశ ప్రాంగణాలను సిద్ధం చేశారు. దిగ్గజ కంపెనీల చైర్మన్లు, సీఈఓలు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమై చర్చలు జరిపేందుకు వీలుగా మరో ప్రత్యేక హాల్‌ సిద్ధం చేశారు. భాగస్వామ్యాలు, ఒప్పందాలు కుదుర్చుకునేందుకు వేర్వేరుగా ఏర్పాట్లు చేశారు. ఒకేసారి రెండు, మూడు కార్యక్రమాలు నిర్వహించుకునేలా సమావేశ మందిరాలు. ఈ సమావేశ మందిరాల్లో ప్రారంభ, ముగింపు కార్యక్రమాలతో పాటు ఆరు కీలకమైన అంశాలపై మేధో మథనం జరుగుతుంది.

ఈ వార్తలనూ చదవండి:

ఇదే స్ఫూర్తితో స్వచ్ఛాంధ్ర సాధనకు అంతా కలిసి పనిచేద్దాం: సీఎం చంద్రబాబు

15 ఏళ్ల తర్వాత లంచం కేసులో తీర్పు.. మాజీ సీఐకి ఏడాది జైలు

Updated Date - Nov 12 , 2026 | 05:13 AM