ABN: నేడు, రేపు ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ఆటో ఎక్స్‌పో
ABN , Publish Date - Mar 21 , 2026 | 01:58 AM
ఆటోమొబైల్ రంగంలో నూనత ఆవిష్కరణలకు వేదికగా నిలిచే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఆటో ఎక్స్‌పో నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శని, ఆదివారాల్లో తిరుపతిలోని ఇందిరామైదానం వేదికగా నిర్వహించనున్న ఎక్స్‌పోను శనివారం ఉదయం 10 గంటలకు జిల్లా రవాణాశాఖ అధికారి కె.మురళీమోహన్ ప్రారంభించనున్నారు.
తిరుపతి, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): ఆటోమొబైల్ రంగంలో నూనత ఆవిష్కరణలకు వేదికగా నిలిచే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఆటో ఎక్స్‌పో నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శని, ఆదివారాల్లో తిరుపతిలోని ఇందిరామైదానం వేదికగా నిర్వహించనున్న ఎక్స్‌పోను శనివారం ఉదయం 10 గంటలకు జిల్లా రవాణాశాఖ అధికారి కె.మురళీమోహన్ ప్రారంభించనున్నారు. 13 స్టాళ్లతో ఎలక్ర్టిక్ వాహనాలు, యువతను ఆకర్షించే బైకులు, కుటుంబాల కోసం కొత్త కార్ల మోడళ్లు, కమర్షియల్ వాహనాలు ఇలా అన్నీ ఒకేవేదికపై అందుబాటులో ఉండనున్నాయి. తక్షణ రుణాలిచ్చే బ్యాంకులతో అనుసంధానం చేసే ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఈ ఆటో ఎక్స్‌పోలో భార్గవి ఆటోమొబైల్స్, నికిమోటార్స్, వోక్స్‌వాగన్ పీపీఎస్, సాగర్ హోండా, ఫృధ్వీ హీరో, ఎస్ అండ్‌ఎస్ సుజుకి, శ్రీరామ్ ఎంటర్‌ప్రైజెస్, నెక్సా భార్గవి ఆటోమొబైల్స్, యమహా ఆర్కే ఎంటర్‌ప్రైజెస్, సీజెఎన్ హైటెక్ మోటార్స్ , హుండాయ్ ఆర్కే ఎంటర్‌ప్రైజెస్, హర్ష ఆటోఏజెన్సీస్ స్టాళ్లు అందుబాటులో వుంటాయి.పుత్తూరు సమీపంలోని సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యాసంస్థ ఆటో ఎక్స్‌పోకు ప్రధాన స్పాన్సరర్‌గా వ్యవహరిస్తోంది.వెంకటరమణ హార్ట్ అండ్ మెటర్నిటీ హాస్పిటల్, విశ్వం విద్యాసంస్థలకు చెందిన స్టాల్స్ కూడా ఎక్స్‌పోలో అందుబాటులో ఉంటాయి.