Share News

Srikalahasti: ముక్కంటి ఆలయ హుండీలో చోరీ

ABN , Publish Date - Jun 22 , 2026 | 01:33 AM

ముక్కంటి ఆలయంలోని హుండీలో నగదును చోరీ చేసిన ఓ భక్తుడిని సిబ్బంది పట్టుకున్నారు.

Srikalahasti: ముక్కంటి ఆలయ హుండీలో చోరీ
పోలీసుల అదుపులో సత్తి వెంకట లక్ష్మణ్‌

శ్రీకాళహస్తి, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): ముక్కంటి ఆలయంలోని హుండీలో నగదును చోరీ చేసిన ఓ భక్తుడిని సిబ్బంది పట్టుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో పది రోజుల నుంచి విపరీతమైన భక్తుల రద్దీ నెలకొంది. హుండీల్లో నగదు నిండిపోయింది. ఈ నేపథ్యంలో రాజమండ్రిలోని తాడితోట వైఎ్‌సఆర్‌కాలనీకి చెందిన సత్తి వెంకట లక్ష్మణ్‌(48) ఆదివారం ముక్కంటి ఆలయానికి వచ్చాడు. స్వామివారి దర్శనానంతరం గర్భాలయం పక్కనే ఉన్న హుండీలో చేయిపెట్టి అందినకాడికి నగదును చోరీ చేసి, జేబులు నింపుకున్నాడు. భక్తుడు కొంతసమయం హుండీ వద్దే ఉండటంతో ఆలయ సిబ్బంది అనుమానంతో తనిఖీ చేశారు. హుండీలోని నగదు చోరీ చేసినట్లు తేలడంతో ఎస్పీఎఫ్‌ బృందానికి అప్పగించారు. ఆ తర్వాత శ్రీకాళహస్తి వన్‌టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. ఆలయ అధికారుల ఫిర్యాదుతో చోరీ కేసు నమోదు చేశారు. అతడి వద్ద నుంచి సుమారు రూ.75వేలను స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Jun 22 , 2026 | 01:33 AM