Share News

Re-survey: పకడ్బందీగా రీసర్వే నిర్వహించాలి

ABN , Publish Date - Jun 13 , 2026 | 01:14 AM

తప్పులులేకుండా పకడ్బందీగా రీసర్వే నిర్వహించాలని సర్వే, సెటిల్మెంట్‌ అండ్‌ ల్యాండ్స్‌ రాష్ట్ర కమిషనర్‌ కూర్మనాథ్‌ సూచించారు.

Re-survey: పకడ్బందీగా రీసర్వే నిర్వహించాలి
రీ సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న రాష్ట్ర కమిషనర్‌ కూర్మనాథ్‌

బంగారుపాళ్యం, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): తప్పులులేకుండా పకడ్బందీగా రీసర్వే నిర్వహించాలని సర్వే, సెటిల్మెంట్‌ అండ్‌ ల్యాండ్స్‌ రాష్ట్ర కమిషనర్‌ కూర్మనాథ్‌ సూచించారు. బంగారుపా ళ్యం మండలం వెంకటగిరి గ్రామ రెవెన్యూలో జరుగుతున్న 5వవిడత భూసర్వేను శుక్రవారం ఆయన పరిశీలించారు. రైతులు తమ భూమి రికార్డుల్లోని వివరాల ను పరిశీంచుకోవాలని సూచించారు. ఏవైనా సమస్యలుంటే అధికారుల దృష్టికి తేవాలని కోరారు. అనంతరం సర్వే నెంబరు 167/3, 169/1లో జరుగుతున్న రీ సర్వేను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా సర్వేయర్‌ పుల్లయ్య, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే చిట్టిబాబు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే కృష్ణమూర్తి, మండల సర్వేయర్‌ లావణ్య, సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపంజాణి మండలం నాగిరెడ్డిపల్లె పంచాయతీలోని రీ సర్వేనూ ఆయన పరిశీలించారు.

Updated Date - Jun 13 , 2026 | 01:14 AM