Share News

Shettipalle: శెట్టిపల్లెవాసుల కల సాకారం

ABN , Publish Date - Apr 11 , 2026 | 01:11 AM

తిరుపతి సమీపంలోని శెట్టిపల్లెవాసుల దశాబ్దాల కల సాకారమైంది. శుక్రవారం నుంచి తిరుపతి అర్బన్‌, తిరుపతి రూరల్‌, రేణిగుంట సబ్‌ రిజిస్ర్టేషన్‌ కార్యాలయాల్లో లబ్ధిదారులకు ప్లాట్ల రిజిస్ర్టేషన్‌ ప్రారంభమైంది.

Shettipalle: శెట్టిపల్లెవాసుల కల సాకారం
లబ్ధిదారుకు రిజిస్ర్టేషన్‌ డాక్యుమెంట్‌ అందజేస్తున్న తుడా చైర్మన్‌ దివాకర రెడ్డి

తిరుపతి సెంట్రల్‌, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): తిరుపతి సమీపంలోని శెట్టిపల్లెవాసుల దశాబ్దాల కల సాకారమైంది. శుక్రవారం నుంచి తిరుపతి అర్బన్‌, తిరుపతి రూరల్‌, రేణిగుంట సబ్‌ రిజిస్ర్టేషన్‌ కార్యాలయాల్లో లబ్ధిదారులకు ప్లాట్ల రిజిస్ర్టేషన్‌ ప్రారంభమైంది. మొదటిరోజు 140మందికి తుడా చైర్మన్‌ దివాకర రెడ్డి చేతుల మీదుగా పట్టాలు అందజేశారు.జేసీ గోవిందరావు, జిల్లా రిజిస్ర్టార్‌ శ్రీరామ్‌కుమార్‌, తుడా సీపీవో దేవికుమారి, కార్యదర్శి శ్రీకాంత్‌బాబు తదితరులు రిజిస్ర్టేషన్‌ ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ సంధర్భంగా తుడా చైర్మన్‌ మాట్లాడుతూ 50 సంవత్సరాలుగా పెండింగ్‌లో వున్న శెట్టిపల్లె సమస్యకు కూటమి ప్రభుత్వంలో మోక్షం కలిగిందన్నారు. రెండు సెంట్ల లోపు భూమి వున్న 900 మంది పేదలకు పూర్తి స్థాయిలో భూమిని ఉచితంగా అందచేస్తున్నట్లు చెప్పారు. శెట్టిపల్లెను మెగా శాటిలైట్‌ టౌన్‌ షిప్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్‌, శ్మశాన వాటిక, వీధి దీపాలు, తదితర మౌలిక వసతులు కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.అర్బన్‌ రిజిస్ర్టార్‌ నీరజ,ఎస్‌ఈ రవీంద్రయ్య, భూ సేకరణ అధికారి సుజన, తహసిల్దార్‌ సురే్‌షబాబు తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రం శెట్టిపల్లె లబ్ధిదారులు తుడా కార్యాలయం వద్ద సంబరాలు జరిపి స్వీట్లు పంచి పెట్టారు.

Updated Date - Apr 11 , 2026 | 01:11 AM